Asia Cup 2022: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా, పాకిస్థాన్ బౌలర్ నసీం షా కలిసి చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నసీం షా తన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాడు. ఊర్వశి రౌతెలా అంటే ఎవరో తెలియదని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశాడు. 


అఫ్ఘనిస్థాన్ తో సూపర్- 4 మ్యాచ్ లో రెండు బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి తన జట్టును గెలిపించాడు పాక్ బౌలర్ నసీం షా. ఆ సందర్భంగా ఊర్వశితో కలిసి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేశాడు. వాటిని నటి తన అకౌంట్ లో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేశారు. అంతకుముందు ఊర్వశి రౌతెలా, భారత వికెట్ కీపర్ పంత్ మధ్య జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రోలర్స్ రెచ్చిపోయారు. 


ఇదిలా ఉండగా.. నేడు పాకిస్థాన్- శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ యువ పేసర్ నసీం షా ఇంటర్వ్యూ ఇచ్చాడు. విలేకర్ల నుంచి ఊర్వశి రౌతెలా గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై నసీం స్పందిస్తూ.. ఊర్వశి ఎవరో నాకు తెలియదు. నేను నా ఆటపైనే దృష్టిపెట్టాను. అభిమానుల నుంచి నాకు ఎన్నో వీడియోలు వస్తుంటాయి. అవన్నీ నేను పట్టించుకోను. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ చెప్పాడు. 


అంతకుముందు రిషభ్ పంత్, ఊర్వశి రౌతెలా మధ్య ఇన్ స్టాగ్రామ్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. పంత్ తనకోసం గంటలు గంటలు ఎదురుచూశాడని అర్థం వచ్చేలా ఊర్వశి పోస్టులు చేసింది. దీనిపై పంత్ స్పందిస్తూ.. ఫేమ్ కోసం కొంతమంది అబద్ధాలు ఆడతారని అన్నాడు. అనంతరం బాలీవుడ్ నటి ఆర్పీని కౌగర్‌ హంటర్‌ (తన కంటే ఎక్కువ వయసు ఉన్న అందమైన అమ్మాయిలతో శారీరక సంబంధం కోరుకునే యువకుడు) అంటూ అని పేర్కొన్నారు. అంతే కాదు... 'ఛోటా భయ్యా నువ్వు బ్యాట్‌, బాల్‌తో ఆడుకో! నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి' అని ఊర్వశి రౌతెలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. 
 


తన పోస్టుకు 'ఆర్పీ భయ్యా', 'డోంట్‌ టేక్‌ అడ్వాంటేజ్‌ ఆఫ్‌ ఏ సైలెంట్‌ గాళ్' హ్యాష్ ట్యాగ్‌లను కూడా ఊర్వశి రౌతెలా జత చేశారు. తాను మౌనంగా ఉండటాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దని ఆమె పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.