Bihar News: అడ్మిట్ కార్డులపై ధోని, ప్రధాని మోదీ ఫొటోలు!

ABP Desam Updated at: 11 Sep 2022 05:58 PM (IST)
Edited By: Murali Krishna

Bihar News: ఓ యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థుల అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ, ధోని ఫొటోలు వచ్చాయి.

(Image Source: PTI)

NEXT PREV

Bihar News: బిహార్‌కు చెందిన ఓ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫొటోలు ముద్రించడం కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూనివర్సిటీ దర్యాప్తునకు ఆదేశించింది.


ఇదీ జరిగింది


బిహార్‌లోని లలిత్‌ నారాయణ్‌ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల కోసం ఇటీవల అడ్మిట్‌ కార్డులు జారీ చేశారు. అందులో కొన్ని అడ్మిట్‌ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, బిహార్‌ గవర్నర్ ఫగూ చౌహాన్‌ ఫొటోలు ఉన్నాయి. అనంతరం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


కఠిన చర్యలు


మధుబనీ, సమస్తిపూర్‌, బెగుసరాయ్‌ జిల్లాల పరిధిలోని కాలేజీలకు చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థులకు ఈ అడ్మిట్ కార్డులు వచ్చాయి. అనంతరం ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఫొటోలను విద్యార్థులే అప్‌లోడ్‌ చేసినట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు కారణమైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతోపాటు వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా ఫిర్యాదు చేస్తామన్నారు.



అడ్మిట్‌ కార్డుల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులే తమ ఫొటోలతో పాటు వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం వాటిని పరిశీలించి అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తాం. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. యూనివర్సిటీ పేరుకు మచ్చతెచ్చే ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం.                 - యూనివర్సిటీ రిజిస్ట్రార్‌


Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక ప్రకటన!


Also Read: Queen Elizabeth Funeral: రాణిని చివరిసారి చూసేందుకు కూడా మేఘన్‌కు నో పర్మిషన్!

Published at: 11 Sep 2022 05:54 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.