ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ప్రస్థానం ముగిసింది. రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన సయాకా టకహాషి చేతిలో 19-21, 21-16, 17-21 చేతిలో ఓడిపోయింది. గత కొంతకాలంగా పీవీ సింధు పేలవ ఫామ్ కొనసాగుతోంది. తను ఒక కప్ గెలిచి కూడా చాలా కాలం అవుతోంది.


గేమ్‌ను సింధు పాజిటివ్‌గానే ప్రారంభించింది. మొదట్లోనే 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే టకహాషి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి సెట్‌ను 21-19తో సొంతం చేసుకుంది.


ఇక రెండో సెట్‌లో సింధు పైచేయి సాధించింది. 11-4తో ఆధిక్యం సంపాదించిన సింధు సయాకాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 21-16తో రెండో సెట్ దక్కించుకుంది. ఇక మూడో సెట్ హోరాహోరీగా సాగింది. 11-10తో స్వల్ప ఆధిక్యం సాధించిన సయాకా... సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తర్వాత 16-11తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లి 21-17తో సెట్‌ను, మ్యాచ్‌ను దక్కించుకుంది.


ఇక యువ భారత ఆటగాడు లక్ష్యసేన్ ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండర్స్ ఆంటోన్‌సేన్‌పై 21-16, 21-18 తేడాతో గెలుపొందారు. సైనా నెహ్వాల్ కూడా 14-21, 21-17, 17-21తో ఓటమి పాలయింది.