శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేయాలంటే సమతులాహారంతో పాటూ సరైన నిద్ర కూడా అవసరం. ఉదయమంతా మనతో పాటూ కష్టపడిన అవయవాలు నిద్రపోయాకే సేదతీరుతాయి. నిద్ర అవసరాన్ని తెలిపేందుకు ప్రతి ఏడాది మార్చి మూడో శుక్రవారం ‘వరల్డ్ స్లీపింగ్ డే’ (World Sleeping Day) నిర్వహిస్తారు. ఆ రోజున నిద్ర ఎంత అవసరమో చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ 2008 నుంచి స్లీపింగ్ డే నిర్వహిస్తోంది. శుక్రవారం మార్చి 18 నిద్ర దినోత్సవం. ఈ సందర్భంగా నిద్రకు సంబంధించి ఆసక్తికర నిజాలు తెలుసుకుందాం. 


ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండగలం?
 ఒక మనిషి నిద్రలేకుండా ఎన్ని రోజులు బతకగలడు అన్న సందేహం చాలా మందిలో ఉంది. దీన్ని ప్రయోగపూర్వకంగా చూపించారు ఒక టీనేజర్. 1965లో 17 ఏళ్ల హైస్కూల్ విద్యార్తి రాండీ గార్డనర్ సైన్స్ ఫెయిర్ కోసం నిద్రపోకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దాదాపు 264 గంటలు అంటే దాదాపు 11 రోజులు నిద్రపోకుండా ఉన్నాడు. అంతకుమించి ఉంటే అవయవాలు పనిచేయడం మానివేసి మరణం సంభవిస్తుంది. కొందరు 11 రోజులు ఉండేలేరు. అయిదు రోజులు దాటితేనే వివిధ రకాల సమస్యలతో ఆసుపత్రిలో చేరుతారు. 


1. ఒక మనిషి తన జీవితకాలంలో మూడో వంతు నిద్రలోనే గడుపుతారు. 
2.  ఉదయాన్నే మంచం మీద నుంచి లేవడానికి చాలా ఇబ్బంది పడే ఆరోగ్యపరిస్థితి ఉంది. దాని పేరు డైసానియా. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. మంచం మీద నుంచి లేవడా వీరికి చాలా కష్టం. 
3. నిద్రలోనే కొంతమంది పనులు చేస్తారు. వాటిని అసహజ కదలికలుగా చెబుతారు వైద్యులు. ఈ స్థితిని పారాసోమ్నియా అంటారు. ఈ వ్యాధితో బాధపడేవాళ్లు నిద్రలోనే డ్రైవింగ్ చేయడం, వేరొకరిని హత్య చేయడం వంటివి కూడా చేస్తారు. 
4. ప్రపంచజనాభాలో 15 శాతం మంది స్లీప్ వాకర్స్. 
5. ఆహారలేమి కన్నా నిద్రలేమే మనుషుల్ని త్వరగా చంపేస్తుంది. 
6. నిద్రలేమి వల్ల నొప్పి తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. సరైన నిద్ర వల్ల ఏ గాయమైనా త్వరగా నయమవుతుంది. 
7. ఆరోగ్యకరమైన వ్యక్తి కేవలం పావుగంటలో నిద్రలోకి జారుకుంటాడు. 
8. క్షీరదాలలో నిద్రను ఆపుకునే ఏకైక క్షీరదం మనిషి మాత్రమే. మిగతావన్నీ నిద్రరాగానే పడుకుంటాయి. 
9. స్లీప్ వాకర్‌ని బలవంతంగా నిద్రలేపకూడదు. అలా మంచం మీద పడుకోబెట్టాలి. వారిని నిద్రలేపితే గుండె పోటు లేదా కోమాలోకి వెళ్లే ఛాన్సు ఎక్కువ. 


Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది


Also read: ఇది నిజమా? మహిళలకు మగ సర్జన్లు ఆపరేషన్ చేస్తే వారు చనిపోయే అవకాశం ఎక్కువా?