కన్యారాశి అధిపతి - బుధుడు
కన్యారాశి వారి పేర్లలో మొదటి అక్షరాలు- టో, పా, పీ, పూ, షం, ణా, ఠా, పే, పో
కన్యారాశివారికి మంచి రోజులు- బుధవారం,శుక్రవారం, శనివారం
జూన్ 8 కన్యా రాశిఫలితం ( Virgo Horoscope 8th June 2022)
కన్యారాశికి జీవిత భాగస్వామితో ఈ రోజు మంచి సఖ్యత ఉంటుంది.ఈ రాశి వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమ సంబంధాలను మూడుముళ్ల బంధంగా మార్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాల్లో లాభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ గురించి కుటుంబంతో చర్చించండి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. కొన్ని పనులు పూర్తిచేసేందుకు కంగారు పడకండి. కొత్త వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో పై అధికారులతో సమావేశం అవుతారు. వివాదాలకు దూరంగా ఉండండి.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
కన్యా రాశి వార ఫలం ( Virgo Weekly Horoscope June 6 to June 12)
ఈ వారం కన్యారాశివారి ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో చెల్లించాల్సిన అప్పులు కొంతవరకూ క్లియర్ చేస్తారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికల్లా పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో వేధిస్తోన్న ఓ సమస్య ఈ వారం పరిష్కారం అవుతుంది. స్థిరాస్తులు కొనుగోలు దిశగా అడుగేస్తారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వ్యాపారులు సంతోషకరమైన వార్త వింటారు. వారం చివరిలో బంధువిరోధాలు, ఒత్తిడి ఉంటుంది.
Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే
కన్యా రాశి జూన్ నెల ఫలితం (Virgo 2022 June Horoscope)
కన్యా రాశివారికి జూన్ నెలలో కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కష్టపడితే మాత్రమే ఫలితాలు అందుకుంటారు. చేయు వృత్తి, వ్యాపారాలు అంత బాగా ఉండవు. అవమానకర సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో నిర్లక్యం వద్దు. కుటుంబ సభ్యులతో అనవసర తగాదాలుంటాయి. అకాల భోజనం చేస్తారు.శరీర శ్రమ పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడొద్దు.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.