Vastu Tips In Telugu: తన జీవితంలో ప్రతి వ్యక్తి తనకు మరియు తన కుటుంబానికి ఒక ఇంటిని నిర్మించాలని కలలు కంటాడు, దాని కోసం అతను తన మొత్తం జీవిత మూలధనాన్ని పెట్టుబడి పెడతాడు. మీరు వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి గోడల రంగు, ఫర్నిచర్ ప్లేస్‌మెంట్, మొక్కల ఎంపిక, ఇంటి పేరును ఎంచుకున్నప్పుడు ఆ ఇల్లు మరింత అదృష్టాన్ని క‌లిగిస్తుంది. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఇవన్నీ మీ పురోగతికి సహాయకారిగా పరిగణిస్తారు. మీరు మీ కొత్త ఇంటికి అదృష్టాన్ని తెచ్చే పేరు కోసం చూస్తున్నట్లయితే, మీ ఇంటికి పేరును ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.


1. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి పేరు సానుకూల అర్థాన్ని కలిగి ఉండే విధంగా ఎంచుకోవాలి, ఎందుకంటే అలా చేయడం వలన సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇంటి పేరు తెచ్చే శక్తి వ‌ల్ల‌ మీరు, మీ కుటుంబం అంద‌రినీ ఆకట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలి. అంటే, మీ ఇరుగుపొరుగువారు ఆ పేరును ఉపయోగించకూడదు లేదా వారి ఇంటికి ఆ పేరు పెట్టకూడద‌ని గుర్తుంచుకోండి.


Also Read : ఈ గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది!


2. ఇంటి పేరును ఎల్లప్పుడూ రాయి లేదా చెక్కపై చెక్కాలని వాస్తు శాస్త్రంలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల దాని సానుకూల ప్రభావం పెరుగుతుంది. ప్రధాన ద్వారం గేటుపై ఇంటి పేరు రాయవద్దు. ఇంటిపేరు ఎప్పుడూ ప్రవేశ గోడపైనే  ఉండాలి.


3. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పేరు మీద ఎప్పుడూ చిన్న బల్బు లేదా ట్యూబ్ లైట్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ఉత్తేజకరమైన శక్తితో నిండిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పేరు  ప్రభావాన్ని మెరుగుపరచాలనుకుంటే, మీరు ఇంటి పేరు ముందు లేదా పైన స్వస్తిక్‌ లేదా ఓం చిహ్నాన్ని ఉంచవచ్చు.
అదృష్టాన్ని తెచ్చే కొన్ని ఇంటి పేర్లు


శ్రీనివాసం: సంపదల నిల‌యం, లక్ష్మీదేవి నివాసం
శాంతినికేతం: శాంతి ధామం
ప్రేమ కుంజ్‌: ప్రేమతో నిండిన ఇల్లు
అషియానా: ఆశ్రయం
కృష్ణరాజ: శాంతి, ప్రేమను ఆకర్షిస్తుంది
శివ శక్తి: శివుని భక్తుని ఇంటి పేరు
రామాయణం: పవిత్ర హిందూ మత గ్రంథం పేరు
దీవెన: భగవంతుని దయ
ఆనంద నిలయం: ఆనందకరమైన శాంతికి నిలయం
శాశ్వ‌త‌: ప్రారంభం, ఏకైక, మొదటి
ప్రార్థన: భగవంతుని పట్ల భక్తి


Also Read : ఈ దిక్కున బాత్రూమ్ ఉంటే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు ఉండవు!


ఇక్కడ పేర్కొన్న వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని పైన పేర్కొన్న పేర్లను దృష్టిలో ఉంచుకుని మీ ఇంటికి పేరు పెడితే సుఖం, శాంతి, ఐశ్వర్యం, శాంతి మీ ఇంటికి చేరతాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.