Vastu Tips In Telugu: దేవతామూర్తులలో గణపతికి మొదటి పూజ మాత్రమే కాకుండా కష్టాలను తొలగించేవాడ‌ని, జ్ఞానాన్ని ప్ర‌సాదించేవాడని విశ్వసిస్తారు. విఘ్నాల‌ను ప‌రిహ‌రించే గ‌ణ‌ప‌తి ఇంటిలోని వాస్తు దోషాల‌ను కూడా తొల‌గిస్తాడ‌ని విశ్వ‌సిస్తారు. అందుకే ఇంట్లో, ఆఫీసుల్లో గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ను ఉంచుతారు. ఇంటి ప్రధాన ద్వారం, దేవుడి గది, వంటగది, ఆఫీసులో ఉన్న వాస్తు దోషాలు గణ‌ప‌తి విగ్రహంతో మాయ‌మ‌వుతాయి.


1. వినాయక విగ్రహం వాస్తు దోషాన్ని ఎలా నివారిస్తుంది.?
పిల్లల స్టడీ రూమ్ లేదా రీడింగ్ టేబుల్‌పై పసుపు లేదా లేత ఆకుపచ్చ గణ‌ప‌తి విగ్రహాన్ని ఉంచండి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచవద్దు. దేవుడి గదిలో పసుపు గణపతి విగ్రహాన్ని ఉంచి పూజించడం శుభప్రదం. ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే, తెల్లటి గణ‌ప‌తి విగ్రహాన్ని డబ్బు భ‌ద్ర‌ప‌రిచే ప్రదేశంలో ఉంచండి.


Also Read : సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…


ఇంట్లో గణ‌ప‌తి విగ్రహాన్ని ప్రతిష్టించడం, వ్యాపార స్థలంలో వినాయకుడిని ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని గుర్తుంచుకోండి. ఇంటి ప్రధాన ద్వారం లోపల వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ప్రతి ఉదయం పూజ చేసి అర్ఘ్యం సమర్పించండి. కానీ, పడకగదిలో గణ‌ప‌తి విగ్రహం, ఫోటో పెట్టకూడదు.


2. వినాయ‌క‌ విగ్రహాన్ని ఈ దిశలో ఉంచండి
ఇంటి ఈశాన్య దిక్కులో వినాయ‌క విగ్ర‌హం ప్రతిష్టించడం అత్యంత శ్రేయస్కరం. ఇంట్లో ఈశాన్య మూల పూజకు ఉత్తమమైనది. మీరు ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో వినాయకుడిని ఉంచవచ్చు. విగ్రహాన్ని ఉంచేటప్పుడు, ఆయ‌న‌ రెండు పాదాలు నేలను తాకేలా చూసుకోండి. విగ్రహాన్ని ఇలా ఉంచితే విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఇంట్లో దక్షిణం వైపు వినాయకుడిని పెట్టకూడదు.


3. గణేశ ప్రతిష్ఠాపన నియమాలు
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలను ఉంచవద్దు. పూజా మందిరంలో మూడు వినాయక విగ్రహాలను కలిపి ఉంచవద్దు. తొండం ఎడమవైపున‌కు తిరిగిన వినాయకుడి విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచాలి. అంటే తొండం ఎడమవైపున‌కు ఉన్న‌ వినాయకుడి విగ్రహాన్నే ఇంట్లో పెట్టుకోవాలి. విగ్రహం ఎత్తు పన్నెండు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదని గమనించండి. ఇంట్లో ఉంచేందుకు పసుపు రంగు గణపతి విగ్ర‌హం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. వినాయకుడికి తులసి మాల‌ను ఎప్పుడూ సమర్పించవద్దు.


Also Read : వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?


పైన పేర్కొన్ననియ‌మాల‌ ప్రకారం వినాయ‌క‌ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా మీరు సుఖం, శాంతి, శ్రేయస్సు పొందుతారు. ఇలా ఇంట్లో గ‌ణ‌ప‌తి విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషం వంటి సమస్యలు మాయమవుతాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.