Vastu Tips In Telugu: మన దైనందిన‌ జీవితంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తును సరిగ్గా ఉపయోగించినట్లయితే, జీవితాన్ని మంచి మార్గంలో నడిపించవచ్చు. దీని ద్వారా, జీవితంలో విజయం సాధించవచ్చు, ప్రతికూల విషయాల నుంచి రక్షణ కూడా పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, స్నానాల గదికి సంబంధించిన కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. బాత్రూమ్ వాస్తుకు సంబంధించి ఈ విషయాల‌ను గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు.

  


బాత్‌రూమ్‌కి వాస్తు ఎందుకు ముఖ్యం.?
స్నానపు గదులు, మరుగుదొడ్లు ప్రతికూలతను సృష్టిస్తాయి. ఈ ప్రదేశాల ప్రభావం కారణంగా, ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. దీంతో పాటు, ఇంట్లో నివ‌సించే సభ్యుల ఆరోగ్యం తరచుగా క్షీణించవచ్చు. అందుకే వీటిని వాస్తుపరంగా నిర్మించడం మంచిది.        


Also Read : పడకగదిలో ఈ వస్తువులు పెడితే దంప‌తుల మ‌ధ్య‌ ప్రేమ పెరుగుతుంది


బాత్రూమ్ ఈ దిశలో ఉండాలి    
వాస్తు ప్రకారం, బాత్రూమ్ ఇంటికి ఉత్తరం లేదా వాయవ్య మూలలో ఉండాలి. దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో బాత్రూమ్‌ను ఎప్పుడూ నిర్మించవద్దు. ఇలా చేయడం వల్ల ప్రతికూలత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా దిగజారడం మొదలవుతుంది. స‌రైన‌ దిశలో వీటిని నిర్మించ‌డం ద్వారా, జీవితాన్ని మంచి దిశలో నడిపించడానికి వాస్తుశాస్త్రం సహాయపడుతుంది.    


ఈ స్థలంలో బాత్రూమ్ ఉండకూడదు       
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదికి ముందు లేదా పక్కన బాత్రూమ్ ఉండకూడదు. ఎందుకంటే వంటగదిలో స్ట‌వ్ ఉంటుంది. ఇది అగ్నికి సంకేతం. బాత్రూంలో నీరు ఉంటుంది. నిజానికి, ఈ రెండు శక్తులు వ్యతిరేకం. అందుకే బాత్రూమ్ ఎప్పుడూ వంటగది పక్కన ఉండకూడదు. అలాగే టాయిలెట్ సీటు పశ్చిమ లేదా వాయవ్య దిశలో ఉండాలి.        


Also Read : ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంచితే ఆర్థిక‌ సమస్యలు త‌లెత్తుతాయి!               


బాత్రూంలో కిటికీ ఎందుకంటే     
వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూంలో కిటికీ ఉండాలి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఉత్తరం లేదా పడమర వైపు ఈ కిటికీ ఉండాలని గుర్తుంచుకోండి. ట్యాప్ లేదా ట్యాంక్ నుంచి నీరు కారకూడదు, ఎందుకంటే ఇది వివిధ పరిణామాలకు కారణమవుతుంది. బాత్ ట్యాప్ పగలకూడదు. కుళాయి నుంచి నీరు కారుతుంటే, ఇంట్లో ఆర్థిక‌ నష్టం జరుగుతుంది. దీంతో పాటు అలాంటి ఇళ్ల‌లో ఆర్థిక సంక్షోభం త‌లెత్తుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అనేక సమస్యలను నివారించవచ్చు.       


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Also Read: బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి మంచిరోజులు, అక్టోబరు 26 రాశిఫలాలు