నాగ్‌పుర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌(మొయిల్‌) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 9లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


వివరాలు..


* ఖాళీల సంఖ్య: 32.


➥ మైన్ ఫోర్‌మాన్-1: 01 పోస్టు


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.


వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతం: రూ.26,900-3%- రూ.48,770


➥ సెలెక్ట్‌ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్/ ట్రైనీ ఎంపిక గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్: 05 పోస్టులు


అర్హత: డిప్లొమా (మైనింగ్& మైన్ సర్వేయింగ్) అర్హత ఉండాలి. డిప్లొమా తర్వాత మైన్‌ఫోర్‌మ్యాన్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇక ఫ్రెషర్స్ అయితే 2 సంవత్సరాల కాలానికి ట్రైనీగా చేర్చుకుంటారు. కాంపీటెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాత అభ్యర్థి పనితనం ఆధారంగా క్రమబద్దీకరిస్తారు.


వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతం: రూ.27,600 -3%- రూ.50,040.


➥ మైన్ మేట్ గ్రేడ్-I: 15 పోస్టులు


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ ఉండాలి. గుర్తింపు పొందిన మైనింగ్ సంస్థలో 3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.


వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతం: రూ.24,800-3%- రూ.44,960.


➥ బ్లాస్టర్ గ్రేడ్-II: 11 పోస్టులు


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. బ్లాస్టర్స్ సర్టిఫికేట్ కాంపీటెన్సీ ఉండాలి. గుర్తింపు పొందిన మైనింగ్ సంస్థలో బ్లాస్టర్‌గా ఏడాది అనుభవం తప్పనిసరి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


జీతం: రూ.24,100-3%- రూ.43,690.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: రూ.295. ఎస్సీ/ ఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.11.2023.


Notification


Online Application


Website


ALSO READ:


రాష్ట్రీయ కెమికల్స్‌ & ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..