Vastu Tips In Telugu: మీ జీవితంలో మంచి రోజులు అకస్మాత్తుగా చెడ్డ‌ రోజులుగా మారితే, కచ్చితంగా మీ ఇంటిలోని వస్తువులపై శ్రద్ధ వహించండి. సాధారణంగా ఇంట్లో అలాంటి కొన్ని వస్తువులు ఉంటాయి, అవి ఖాళీ అయినప్పుడు చెడు ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ విషయాలు జీవితంలో ప్రతికూలతను తెస్తాయి, అందువ‌ల్ల‌ కొత్త సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి రావడం ప్రారంభిస్తాయి. అందుకే ఆయుష్షు పెరగడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఖాళీగా ఉంచకూడదు.


ఆహార పాత్ర‌లు, డ‌బ్బాలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు, డ‌బ్బాల‌ను ఖాళీగా ఉంచకూడదు. ఇతర ధాన్యాలు, ముఖ్యంగా బియ్యం ఎప్పుడూ నిండుకోకుండా జాగ్ర‌త్త తీసుకోవాలి. నిండుకునే స్థితికి చేరుతుంటే, మీ పురోగతికి ఆటంకం కలిగించకుండా ఉండేలా, అంతకు ముందే దాన్ని పూరించండి. ధాన్యం నిండుగా ఉంటే అది జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది, మీ ఇంట సంప‌ద‌ను పెంచుతుంది. ఈ రోజువారీ పూజతో పాటు అన్నపూర్ణేశ్వరి దేవి, అన్నపూర్ణ సంపద-ధాన్యాలు, సంపద, అదృష్టానికి దేవత. వీటిని రోజూ పూజించడం వల్ల ఇంట్లో ధాన్యారాశులు తరగవు.


Also Read : ఈ వాస్తు చిట్కాల‌తో ప్ర‌తికూలశ‌క్తుల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు త‌ర‌మండి!


బాత్రూంలో ఖాళీ బకెట్
వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు. బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని తెస్తుంది, ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. మీరు బకెట్ ఉపయోగించక‌పోయినా, ఎల్లప్పుడూ నీటితో నింపండి. అలాగే, విరిగిన బకెట్‌ను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. స్నానం చేయడానికి నీలిరంగు బకెట్ ఉపయోగించండి, ఉపయోగించిన తర్వాత బకెట్‌లో నీటితో నింపండి, ఖాళీగా ఉంచవద్దు.


పూజ గ‌దిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు
పూజ గదిలో నీటి పాత్ర‌ను ఖాళీగా ఉంచవద్దు. చాలా ఇళ్లలో పూజా స్థలంలో నీటి పాత్ర‌లు, గంటలు మొదలైన పూజకు సంబంధించిన వ‌స్తువులు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గ‌దిలో ఉంచిన నీటి పాత్రను ఖాళీగా ఉంచకూడదు. పూజానంతరం, ఒక పాత్రలో నీటిని నింపి, అందులో గంగాజలం, తులసి ద‌ళాన్ని వేసి ఉంచాలి. పూజగదిలో నీళ్లు నింపిన పాత్రను ఉంచితే భ‌గ‌వంతుని దాహం తీరి తృప్తి చెందుతాడ‌ని.. ఫ‌లితంగా, ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెబుతారు. వీటితో పాటు ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్ర‌స‌రిస్తుంది. మరోవైపు, ఖాళీ నీటి పాత్ర ఇల్లు, ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు.


ఖజానా ఖాళీగా ఉంచ‌కూడ‌దు
డబ్బు భద్రంగా ఉంచే ఐరెన్ సేఫ్‌, బీరువాను ఖాళీగా ఉండనివ్వవద్దు. బీరువా, ఐర‌న్ సేఫ్ లేదా పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచండి. ఖాళీ పర్సు పేదరికానికి దారి తీస్తుంది. అందుకే పర్సులో కొంత డబ్బు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఖాళీ చేయవద్దు. దీనితో పాటు, మీరు గోమతి చక్రం, శంఖాన్ని కూడా వాటిలో ఉంచితే మీ శ్రేయస్సును మరింత పెంచుతుంది.


Also Read : మీ ఆరోగ్య సమస్యల ప‌రిష్కారానికి సూపర్ వాస్తు చిట్కాలు ఇవే!


నాలుక జార‌కుండా జాగ్ర‌త్త‌
మీ నాలుక ఎప్పుడూ అదుపులో ఉంచుకోండి. మన సంప‌ద‌, ఆర్థిక ప‌రిస్థితిలో భాష కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మీ నాలుకను జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించండి, ఎప్పుడూ ఎవరినీ అవమానించకండి. కుటుంబ పెద్దలను మానసికంగా బాధపెట్టే మాటలు మాట్లాడకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఆర్థిక ప‌రిస్థితి త‌ల‌కిందుల‌వుతుంది. అందుకే కుటుంబ పెద్దలను ఎప్పుడూ అగౌరవపరచకూడదు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.