అక్టోబరు 26 రాశిఫలాలు


మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు సమావేశాలు లేదా ఏదైనా అధికార సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుకూల సమయం. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందదు. ఏ పని అయినా చేసేముందు కచ్చితంగా స్నేహితులను సంప్రదించాలి. శత్రువులు చురుగ్గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండండి. పనిలో కొంత ఒత్తిడికి లోనవుతారు.


వృషభ రాశి
ఈ రాశివారు వృత్తి వ్యాపారం - వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ సమయం మీకు సహకరిస్తుంది.అయితే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు ఎవ్వరికైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు కానీ వారుమాత్రం అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి వేనుకాడరు. మీ మాటతీరుపై నియంత్రణ పాటించాలి. ప్రయాణాలకు ఈ రోజు అంత అనుకూల సమయం కాదు. 


మిథున రాశి
ఈరోజు మీకు శక్తి లేమిగా అనిపిస్తుంంది. తగినంత విరామం, విశ్రాంతి అవసరం. ఈ రోజును సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న పనులన్నీ పూర్తిచేయగలుగుతారు. ఈ రోజు మీకు మంచి రోజు. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో మీకు సరైన గౌరవం ఉండదు. ఇంటల్లో సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మార్కెటింగ్ సంబంధిత పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది.


Also Read: అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ - ఏ రాశులవారు చూడకూడదంటే!


కర్కాటక రాశి
ఈ రాశివారు సోమరితనం తగ్గించుకుంటే మంచిది. ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీరు చేసే పనిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీరు  సహోద్యోగి నుంచి సహాయం తీసుకోవడం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించుకోగలగుతారు. మితిమీరి ఆలోచించవద్దు. మిమ్మల్ని చూసి అసూయపడే వారి సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.


సింహ రాశి
ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. గత విజయాలను తలుచుకుని ముందడుగు వేయండి.ఏదో విషయంపై విచారంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మధురమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై నుంచి దృష్టి మరల్చవద్దు. దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది.


కన్యా రాశి
ఈ రోజు మీ వృత్తిపరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ అసాధారణ పనితీరుకు మీరు ప్రశంసలు అందుకుంటారు. దిగుమతి-ఎగుమతులకు సంబంధించిన వ్యాపారంలో మీరు ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో పరస్పర సామరస్యం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు  ప్లాన్ చేస్తారు. దైవదర్శనానికి వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.


Also Read: చాణ‌క్య నీతి ప్ర‌కారం మీ బంధం ప‌దిలంగా ఉండాలంటే ఈ విషయాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.!


తులా రాశి 
మీరు ఈ రోజు స్పష్టమైన లక్ష్యాలను ప్లాన్ చేసుకోవడం ద్వారా సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు.  కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. స్నేహితుని సహాయంతో మీరు ధన లాభం పొందే అవకాశం ఉంది. మీ శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. మీ గౌరవం  పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి.  పని ఒత్తిడి తగ్గించుకోవాలి.


వృశ్చిక రాశి
మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీలో సానుకూల శక్తి పని చేస్తుంది. పనిలో మీ అసాధారణ పనితీరు మీ సహోద్యోగులలో అసూయకు కారణం కావచ్చు  కుటుంబంలో మీపట్ల ప్రేమ పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కార్యాలయ సమస్యలను పరిష్కరించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. మీకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. 


ధనుస్సు రాశి
మీ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.  విశ్వాసంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మీ కెరీర్లో ముందుకు సాగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఉన్న సమస్యలకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది. ఐటీ రంగంలో పనిచేసే వారికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. 


మకర రాశి
ఈ రోజు మీరు సకాలంలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాబోయే సవాళ్లను త్వరగా పరిష్కరించగలుగుతారు. చేయాలి అనుకున్న పనులను చురుగ్గా చేస్తారు. కార్యాలయంలో టెన్షన్ పెరుగుతుంది. కొత్త సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు షేర్ మార్కెట్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ప్రయాణాలలో సమయం వృధా అవుతుంది.


కుంభ రాశి
ఈ రోజు మీ ప్రాధాన్యతలకు సరిపోయే ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికలను అన్వేషించండి.  సవాళ్లను ముందుగా అంచనా వేసుకోవాలి. ప్రమాదాలకు భయపడవద్దు. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. అవసరమైన సలహాలు తీసుకునేందుకు వెనుకాడవద్దు.  కుటుంబంలోని చిన్న పిల్లలు మీతో సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తుల నుంచి మీరు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. న్యాయవాద వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది


మీన రాశి
కార్యాలయంలో వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీ వ్యక్తిత్వం ఉపయోగించండి. అర్థవంతమైన సంభాషణలలో పాల్గొనండి. ఇతరుల అభిప్రాయాలను వినండి..వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ప్రస్తుతం ఉన్న పరిచయాలు భవిష్యత్ లో ఉపయోగపడతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ పని క్రెడిట్ ఇతర వ్యక్తులు తీసుకునే ఛాన్సుంది. ప్రణాళిక ప్రకారం చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.