Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మానవ సంబంధాల గురించి అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ రోజు లేదా రేపు సంబంధంలో సమస్యలు రావడం సహజం. ఆ సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తి మాత్రమే సంసారం అనే సాగర తీరానికి చేరుకోగలడని అంటారు. అదే విధంగా, మంచి సంబంధం కలిగి ఉండాలంటే, కొన్ని విషయాలను మనలో ఇముడ్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. మన సంబంధాల్లో గొడవ లేదా సమస్యను ఎదుర్కొన్నప్పుడు చాణక్యుడి ఆలోచనలను గుర్తుంచుకోవాలి. అవి ఏంటో తెలుసా?
1. నమ్మకం, గౌరవం
ఏదైనా సంబంధం నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. తన భాగస్వామిని గౌరవించని వ్యక్తితో వారి సంబంధం ఎక్కువ కాలం నిలిచి ఉండదు. సమాజంలోని ఏ వ్యక్తినైనా పదే పదే అవమానిస్తే వారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని, అదే విధంగా మీ సంబంధంలో కూడా స్త్రీ లేదా పురుషులను దూషిస్తే ఆ బంధం ఎక్కువ కాలం ఉండదని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర ఉన్నత స్థాయి వ్యక్తుల ముందు మీ సంబంధాన్ని ఎప్పుడూ గొప్పగానే ఉండేలా చూసుకోవాలని సూచించాడు.
Also Read : ఈ ఐదుగురిని గౌరవిస్తే ధన ప్రవాహం ఖాయం అన్న చాణక్యుడు!
2. అహం
చాణక్య నీతి ప్రకారం, అహంభావం ఉన్న సంబంధంలో అపోహలు, పట్టింపులు రావడం సహజం. అహంభావం కారణంగా, సంబంధాల ప్రాముఖ్యత కోల్పోవడం ప్రారంభమవుతుంది, దాని కారణంగా ఉద్రిక్తత కూడా తలెత్తుతుంది. సంబంధాలలో అహాన్ని చూపడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అహంభావం వల్ల సన్నిహిత సంబంధాలు తమ విలువలను కోల్పోతున్నాయని చాణక్యుడు చెప్పాడు.
3. సోమరితనం
సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు అని మీరు చాలా పుస్తకాల్లో చదివి ఉంటారు లేదా విని ఉంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చాణక్యుడి ప్రకారం, సోమరితనం లేదా ఆశయం లేని వ్యక్తుల నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. అలాంటి వారి ప్రభావం మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది లేదా మిమ్మల్ని వారిలాగే సోమరిపోతుగా చేస్తుంది. సోమరితనం అలవడిన వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకోడు. సోమరులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు.
Also Read : డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలన్న చాణక్యుడు!
పురుషుడైనా, మహిళ అయినా ఏ వ్యక్తి అయినా పైన పేర్కొన్న అంశాలను మనస్సులో ఉంచుకుని, ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ వహిస్తే, వాది సంబంధం ఖచ్చితంగా మెరుగుపడుతుందని ఆచార్య చాణక్యడు స్పష్టంచేశాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.