వాస్తు శాస్త్రంలో, దిక్కులు మాత్రమే కాదు సమయం తెలిపే గడియారం గురించి కూడా ప్రత్యేక విషయాలను వివరిస్తుంది. ఏ గోడమీద మీ గడియారం ఉందో అనే దాన్ని బట్టి కూడా మీ సమయం ఆధారపడి ఉంటుందని వాస్తు చెబుతోంది. అందుకే గడియారం అమర్చే ముందు అది ఏగోడకు పెడితే మంచిదనే విషయం తెలుసుకుంటే మంచిది. సరైన దిక్కున గడియారం అమర్చక పోతే మీకు సమయం అనుకూలించకపోవచ్చట. ఆర్థిక నష్టాలకూ కారణం కావచ్చట. ఈ విషయాల గురించి వాస్తు పండితులు అందిస్తున్న వివరాలు.



  • ఇంట్లో గడియారాన్ని అమర్చేందుకు సరైన దిక్కు ఈశాన్యం. ఈశాన్యంలో గడియారం అమర్చడం వల్ల సర్వదా సమయం అనుకూలిస్తుందట. ఆర్థిక నష్టాలు ఏర్పడకుండా నిరోధించబడుతుందని పండితులు సూచిస్తున్నారు.

  • గడియారాన్ని ఎప్పుడు పశ్చిమం వైపు గోడకు అమర్చకూడదు. ఇలా చేస్తే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవచ్చు.

  • తూర్పు లేదా ఉత్తర దిశలు గడియారం అమర్చుకునేందుకు సరైన దిక్కులు. అలా అమర్చుకో వీలు లేనపుడు పశ్చిమాన అమర్చుకోవచ్చట.

  • దక్షిణం దిశ గోడకు గడియారాన్ని అమర్చకూడదు. ఆగ్నేయం లేదా నైరుతి లో గడియారాలు అమర్చుకోకూడదు.

  • ఇంటి ప్రధాన ద్వారం పైన ఎప్పుడూ గడియారం అమర్చ కూడదు. బెడ్ రూమ్ లో మంచం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదు. ఇవ్వన్నీ కూడా ఆర్థిక నష్టాలకు కారణం అవుతాయి.

  • వాస్తు నియమాలను అనుసరించి ఇంట్లో గడియారం ఆగి పోకూడదు. ఇలా గడియారం ఆగిపోతే కాలం కలిసిరాదు. గడియారం చెడిపోయి అగిపోతే దాన్ని వెంటనే తొలగించాలి. లేదంటే బ్యాడ్ టైమ్ మొదలవుతుంది.

  • ఎప్పుడూ గడియారం గుండ్రగా ఉండేలా చూసుకోవాలి. వేరే ఆకారాల్లో ఉన్న గడియారాల వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడవచ్చు. ఆర్థిక, మానసిక సమస్యలకు ఇది కారణం కావచ్చు.

  • వాస్తు ప్రకారం క్రీమ్, తెలుపు, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు గడియారాలు మాత్రమే అలంకరించుకోవాలి. గడియారంలో ఉండే ఈ రంగులు సానుకూల శక్తిని ఆకర్శిస్తాయి. నలుపు, నీలం, ఎరుపు రంగు గడియారాలను ఇంట్లో పెట్టుకోకూడదు.

  • గోడ గడియారం ఎప్పుడూ సరైన సమయాన్ని సూచించేదిగా ఉండాలి. ముందుకు లేదా వెనక్కి సమయాన్ని చూపకూడదు. తప్పు సమయం సూచించే గడియారాలు ఇంటికి చెరుపు చేస్తాయి.

  • గోడకు అమర్చే గడియారంలో లోలకం ఉండే గడియారం ఇంటికి ఒక హూందాతనాన్ని ఇస్తుంది. చలించే డోలకం ఇంట్లోకి శక్తి ప్రవాహానికి అనుకూలమైంది.

  • గడియారం దుమ్ము కొట్టుకుని ఉండకూడదు. తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి.

  • ఇంటి బయటి వైపు ఎప్పుడూ గడియారాన్ని అమర్చకూడదు.

  • గడియారాలు చాలామంది గిఫ్ట్ గా ఇస్తుంటారు. అయితే మీకంటే వయసులో పెద్ద వారికి గోడగడియారాన్ని బహుమతి గా ఇవ్వకూడదని వాస్తు చెబుతుంది.


Also read : చిన్న లవంగ పరిహారంతో పెద్ద సమస్యలకు పరిష్కారం


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.