Unique Temples:  ఈ ఆలయాల్లో ప్రతి భక్తుడు భగవంతుడికి సిగరెట్ సమర్పిస్తాడు..


సిగరెట్లు నైవేద్యం


భగవంతుడిపై భక్తి విశ్వాసాలు ఉండేవారు మొక్కుల చెల్లింపులో భాగంగా నగదు, ఆభరణాలు, అన్నదానాలు చేస్తుంటారు. కానీ గుజరాత్ లో ఉన్న ఓ ప్రత్యేక ఆలయంలో భక్తులు ఆలయంలో సిగరెట్ నివేదిస్తారు. సూరత్ అథ్వాలిన్స్ ప్రాంతంలో ఉన్న భూత్ మామ ఆలయం ఉంది. అక్కడ దేవుడి దగ్గర ఏదైనా కోరిక కోరుకుని సిగరెట్ వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. శతాబ్ధకాలం క్రితం ఏర్పడిన ఈ ఆలయం పరిసరాల్లో అప్పట్లో వంజరులు నివాసం ఉండేవారట. ఆ సమూహ పెద్ద మరణిస్తే ఇక్కడే సమాధి నిర్మించారు..తననే భూత్ మామ అని పిలుస్తారు. అక్కడివారికి ఇది దేవాలయం. ఇక్కడే 130 ఏళ్ల నాటి ఓ చెట్టుకూడా ఉంది. ఈ భూత్ మామ ఆలయంలో సిగరెట్లు వెలిగిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటారు. భూత్​ మామ విగ్రహం దగ్గర సిగరెట్ వెలిగించిన తర్వాత దాన్ని నోటి దగ్గర మూడు సార్లు ఉంచి తీసేస్తారు. కాల్చిన సిగరెట్లు ఆలయంలో పడేయకుండా బయటకు తీసుకొచ్చేస్తారు. అప్పట్లో బీడీలు నివేదించావారట..రాను రాను సిగరెట్లు పెడుతున్నారు. ఆదివారం రోజు ఈ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భూత్ మామ జన్మదినం పేరుతో నిర్వహించే అన్నదానానికి 15వేలకు మందికిపైగా భక్తులు తరలివస్తారు. కేవలం గుజరాత్ నుంచే కాదు.. ముంబై, సౌరాష్ట్ర నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. భూత్ మామ ఆలయంలో సిగరెట్లతో పాటూ మగాస్ అనే మిఠాయిని నైవేద్యంగా పెడతారు. ఇలా స్వీట్ నైవేద్యంగా సమర్పిస్తే చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని నమ్ముతారు. 


Also Read: అక్టోబరు 29, 30 ఈ రెండు రోజులు సాయంత్రం ఈ దీపం వెలిగించడం మర్చిపోవద్దు!


సిగరెట్ పొగతో ధూపం


గుజరాత్ లో ఉన్న భూత్ మామ ఆలయంలో సిగరెట్ ను నివేదిస్తే..తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఆలయంలో వెలుపల సిగరెట్ ధూపంతో పొగ వేస్తారు. సాధారణంగా ధూపం అంటే అగరొత్తులు, సాంబ్రాణితో వేస్తుంటారు..కానీ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కొలువైన శ్రీ రంగం ఆలయం వెలుపల ఉండే క్షేత్రపాలకుడు మునియప్పన్ కి సిగరెట్ పొగతో ధూపం వేస్తారు. ఇక్కడ అగరొత్తులు వెలిగించరు, కేవలం సిగరెట్ పొగతేనే ధూపం వేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ రంగనాథుడి దర్శనానంతరం బయట ఉన్న ఓ మట్టి కుండలో సిగరెట్లు, చుట్టలు వెలిగించి వేస్తారు. ఆ పొగ రూపంలో తమ సమస్యలు తొలగిపోతాని విశ్వాసం. అందుకే మునియప్పన్ స్వామి దగ్గర ఉండే పూజారులు ఎప్పుడూ మాస్కులు ధరించే ఉంటారు.  


Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!


సిగరెట్ వెలిగిస్తే కోరిక తీరిపోతాయ్


మధ్యప్రదేశ్‌లోని సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయంలోనూ సిగరెట్ వెలిగిస్తే చాలు కోర్కెలు తీరిపోతాయని భక్తుల నమ్మకం.  ఇక్కడ సిగరెట్ వెలిగించి భగవంతుడి ముందు కోర్కెలు చెప్పుకున్న తర్వాత ఓ గడియారం సమర్పించుకుంటారు. ఇక్కడ ఆలయం ఉండదు..కేవలం పెద్ద చెట్టు ఉంటుంది. ఇక్కడ భగవంతుడి ప్రతిమ ఉండదు..యక్షులు ఉంటారని విశ్వసిస్తారు. పూజారులెవరూ ఉండరు...భక్తులు నేరుగా మొక్కులు చెల్లించుకుంటారు. చెట్టునిండా గడియారాలు నిండిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం టిక్ టిక్ టిక్ మని శబ్ధం వస్తూనే ఉంటుంది. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హెల్‌ రోడ్డు పక్కన ఉందీ ఆలయం. 


Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!