Road Accident at Peeleru in Annamayya district Andhra Pradesh | పీలేరు : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పీలేరు నియోజక వర్గం, కలకడ ఇందిరమ్మ కాలనీ వద్ద సోమవారం రాత్రి ఓ ప్రయివేట్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోవడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది సహా మృతుల పూర్తి వివరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని పోలీసులు అంటున్నారు. ఒక్కరి నిర్లక్ష్యంతో ఒక్కో ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరుగుతోందని, కనుక జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ABP Desam | 21 Oct 2024 11:39 PM (IST)
Annamayya Road Accident | అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం