మే 28 శనివారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 28- 05 - 2022
వారం:  శనివారం   


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం


తిథి  : త్రయోదశి  శనివారం మధ్యాహ్నం 1.18 వరకు తదుపరి చతుర్థశి
వారం : శనివారం
నక్షత్రం:  భరణి రాత్రి తెల్లవారుజామున 4.28 వరకు తదుపరి కృత్తిక
వర్జ్యం :  మధ్యాహ్నం 1.17 నుంచి 2.58 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 7.12 వరకు 
అమృతఘడియలు  :  రాత్రి 11.24 నుంచి 1.05 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:25


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


శనివారం రోజు త్రయోదశి తిథి వస్తే ఆ రోజు శనిత్రయోదశిగా అంటారు. ఈ రోజు మరింత పవర్ ఫుల్.ఈ రోజు చేసే జపాలు, దానాలు, పూజలకు ప్రత్యేక ఫలితాలుంటాయని చెబుతారు.ఈ రోజు శనిత్రయోదశి సందర్భంగా ఈ సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఈ మంత్రాలు పఠించండి.నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు..ఆయనకు శనిదేవుడు కలలో కనిపించి శని శాంతిమంత్రాన్ని ఉపదేశించాడు.ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగిందని చెబుతారు.


శని శాంతి మంత్ర స్తుతి
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


శని దోషం నుండి బయటపడేందుకు శని శాంతిమంత్రం 11 సార్లు జపించిన తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే


ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో పాటూ, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.


Also Read: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట


Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది


Also Read: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం