Daily Horoscope Predictions in Telugu


మేష రాశి
ఈ రోజు మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల నుంచి బయటపడి ప్రయోజనం పొందుతారు. మీ దినచర్య అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. 


వృషభ రాశి
ఈ రోజు మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గుడ్ న్యూస్ వినే అవాకాశం ఉంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం లేదా ఇంటికి సంబంధించిన విషయాల్లో ముందడుగుపడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. 


మిథున రాశి
ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు..తీసుకోవద్దు. ప్రయాణాలలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించేందుకు ప్లాన్ చేసుకోండి. 


Also Read: వటసావిత్రి వ్రతం విశిష్టత ఏంటి - మర్రిచెట్టుచుట్టూ సూత్రం ఎందుకు కట్టాలి!


కర్కాటక రాశి
ఈ రాశివారు ఇతరులపై ఆధారపడడం సరికాదు. అనుకున్న పనులు పూర్తిచేయడంతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. మీ కార్యాచరణ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


సింహ రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ పనితీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి. రోజంతా సంతోషంగా ఉంటారు. విలాసాలకు ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. 


కన్యా రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆందోళనలో ఉంటారు. ఇంటిపెద్దలపై కోపంగా వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉండొచ్చు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం కాదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. 


తులా రాశి
ఈ రాశివారు రోజంతా సంతోషంగా ఉంటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. అనవసర వాగ్ధానాలు చేయొద్దు. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  విద్యార్థులు కొత్త సబ్జెక్టులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. 


Also Read: ఈ రాశులవారికి అసూయ చాలా ఎక్కువ - ఎదుటివారి సక్సెస్ ను అస్సలు భరించలేరు!


వృశ్చిక రాశి
ఆధ్యాత్మిక విషయాలపట్ల ఈ రాశివారు సీరియస్ గా ఉంటారు. అవివాహితుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మెప్పు పొందుతారు.  కార్యాలయంలో స్నేహితుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. ఇంటా బయటా మీ ఆధిపత్యం పెరుగుతుంది. 


ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారి మాటతీరు విమర్శలకు గురయ్యేలా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో రాజీపడే అవకాశం వస్తుంది. వ్యవసాయ పనులకు సంబంధించి ఈ రోజు శుభప్రదం.ఉద్యోగులు, వ్యాపారులు మీ పనిపట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ స్నేహితులకు సహాయం చేయాల్సి రావొచ్చు..


మకర రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక లాభం పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచిసమయం కాదు. ఉద్యోగులు, విద్యార్థులకు పెద్దగా మార్పులుండవు. నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఉదరసంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. 


కుంభ రాశి
ఈ రోజు కుంభరాశివారు అప్రమత్తంగా ఉండాలి..శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కి సంబంధించిన సమచారం వింటారు. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. రహస్య శాస్త్రాల అధ్యయనంపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసేవారు అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి


మీన రాశి
ఈ రాశి ఉద్యోగుల ఆలోచనలు కార్యాలయంలో పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదు. కొన్ని పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. ప్రయాణాలు చేసేవారు ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వచ్చేందుకు మరికొంతసమయం పడుతుంది. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.