Thursday Dos And Donts: 2023 అధిక శ్రావణ‌ మాసం నెలలో చివరి గురువారం పూజ ఆగస్టు 10వ తేదీన జరుగుతుంది. శ్రీమహావిష్ణువు, బృహస్పతికి ప్రీతిక‌ర‌మైన‌ గురువారం నాడు శ్రీహరిని పూజించి, ఉపవాసం ఉండటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో బృహస్పతి బలంగా మార‌తాడు. గురువారం వ్రతం ఆచరించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే కొన్ని పనులు గురువారం చేయకూడదని చెబుతున్నారు. గురువారం రోజు ఈ పనులు చేయడం వల్ల గురు దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువారం రోజు మనం చేయకూడని పనులు ఏంటో తెలుసా?


ఈ పండు తినకండి
మీరు గురువారం ఉపవాసం లేదా పూజ చేస్తుంటే, అరటిపండ్లు తినకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే విష్ణువు అరటిపండును ఇష్టపడతాడు. దీనితో పాటు గురువారం అరటి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. ఈ కారణంగా మీరు గురువారం అరటిపండ్లను తినకూడదు. అందుకు బదులుగా, ఈ రోజు మీరు పేదలకు అరటిపండ్లను దానం చేయవచ్చు.


Also Read : గురువారం ఉపవాసం ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఆ దోషం కూడా తొలగిపోతుందట!


తల స్నానం చేయవద్దు
గురువారం, విష్ణువుకు ప్రీతిక‌ర‌మైన‌ రోజు. ఈ మీరు సబ్బు లేదా షాంపూతో త‌ల స్నానం చేయ‌వ‌ద్దు. ఈ రోజు జుట్టు మాత్రమే కాకుండా శరీరాన్ని కూడా సబ్బు లేదా షాంపూతో తోమ‌కూడదు. ముఖ్యంగా మహిళలు ఈ రోజు త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు. గురువారం రోజు తలస్నానం చేయడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం లోపిస్తాయని పెద్ద‌లు చెబుతారు.


జుట్టు కత్తిరించుకోవద్దు
బృహస్పతి బలం పొందాలంటే మీరు గురువారం జుట్టు కత్తిరించకూడదు. ఈ రోజు పురుషులు లేదా మహిళలు తమ జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు. పురుషులు ఈ రోజున గ‌డ్డం కూడా గీయ‌కూడదు. మీరు గురువారం ఈ తప్పులు చేస్తే మీరు గురు దోషాన్ని, జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు.


ఇంటిని క‌డ‌గ‌వ‌ద్దు
గురువారం నాడు ఇంటిని నీటితో క‌డిగి శుభ్రం చేయకూడదు. ఈ రోజు మీరు ఇంటిని శుభ్రం చేయాల‌నుకుంటే, చెత్త మొత్తం తొలగించి ఇంటిని శుభ్రం చేయండి. రోజున మీరు ఇంటి నుంచి పాత ఇనుప వ‌స్తువుల‌ను తొలగించకూడదు. ఈ రోజున మీరు మీ ఇంట్లోని పాత‌ వస్తువులను కూడా అమ్మకూడదు. ఈ తప్పులు చేయడం వల్ల మీ ఇంటిలోని సుఖ సంతోషాలు పోయి అరిష్టాలు కలుగుతాయి.


Also Read : గురువారం పసుపు ఇలా వాడితే జీవితంలో మీకు లోటు ఉండదు..!


అప్పు తీసుకోవద్దు
గురువారం నాడు మీరు ఎవరికీ రుణం ఇవ్వకూడదు, ఎవ‌రి ద‌గ్గ‌రా రుణం తీసుకోకూడదు. అంతే కాదు ఈ రోజు డబ్బుకు సంబంధించిన ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. ఈ రోజు రుణం తీసుకోవడం వల్ల వడ్డీ ఎక్కువ‌కాలం క‌ట్ట‌వ‌ల‌సి రావ‌చ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాకపోవచ్చు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.