Thursday Fasting Rules: సనాతన ధర్మంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని గురు గ్రహం అని పిలుస్తారు. హిందూ ధర్మం, జ్యోతిషశాస్త్రంలో.. బృహస్పతిని జ్ఞానం, శక్తి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మరోవైపు, హిందూ ధర్మంలో గురువారం శ్రీహరికి ప్రియమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంచి పూజలు చేయడం వలన గురువు, నారాయణుని అనుగ్రహం లభిస్తుంది. గురు గ్రహం, నారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం ఏమి చేయాలి? గురువారం పూజ ఆచారాలు - పద్ధతులు చూడండి..
1. గురువారం ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు
జ్ఞాన సముపార్జన
మనం గురువారాల్లో ఉపవాసం ఉండడం వల్ల విద్యా, జ్ఞాన అధిష్ఠాన దేవతలు గురువు అనుగ్రహంతో సంతోషిస్తారు. ఫలితంగా ఉపవాసం పాటించే వ్యక్తి వారి అనుగ్రహాన్ని పొందుతాడు.
Also Read : గురువారం ఇలా చేస్తే గురు దోషం పోయి పురోగతి కనిపిస్తుంది
సత్కార్యాల సాధన
గురువారం చేసే ఉపవాసం ఆ వ్యక్తి చేపట్టే అన్ని శుభ కార్యాలలో విజయం సాధించేలా చేస్తుంది. గురువు అనుగ్రహం వల్ల అతని జీవితంలో శ్రేయస్సు, విజయం లభిస్తుంది.
ఆర్ధిక స్థిరత్వం
గురువారం ఉపవాసం ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆ వ్యక్తి జీవితం అభివృద్ధి చెందుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల ధనలాభ అవకాశాలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక పురోగతి
గురువారం ఉపవాసం వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ఈ ఉపవాసం ద్వారా, ఒక వ్యక్తి తన అంతర్గత జీవితాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతాడు.
2. గురువారం ఉపవాసం ఎలా ఉండాలి
- గురువారం ఉపవాసం ఉండాలంటే తెల్లవారుజామున లేచి స్నానం చేసి గురు మంత్రాలను పఠించాలి.
- తర్వాత రావి చెట్టు కింద పూజ చేసి బృహస్పతిని పూజించాలి.
- ఉపవాస సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి, రోజంతా ధ్యానం చేస్తూ గడపాలి.
- గురువారం ఉపవాసం శ్రద్ధ, భక్తితో పూర్తి చేయాలి.
3. గురువారం రోజు ఏ పనులు చేస్తే మంచిది
- ఈ రోజు గురు మంత్రాలను పఠించడం అత్యంత ప్రయోజనకరం
- పఠించవలసిన అత్యంత ముఖ్యమైన మంత్రం “ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ బృహస్పతయే నమః”
- గురువారం ఉపవాసం చేయాలి
- రావి చెట్టును భక్తితో పూజించండి
- ఈ రోజు బెల్లం, శెనగపిండి, పసుపు, పెరుగు, బెల్లంతో చేసిన ఆహారాన్ని తింటే, జాతకంలో గురు బలం పెరుగుతుంది.
Also Read : గురువారం అరటి చెట్టును పూజిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీరు గురువారం నాడు శ్రీమహావిష్ణువు విశేష అనుగ్రహం పొందాలంటే, ఈ రోజు ఉపవాసం ఉండటంతో పాటు, పైన పేర్కొన్న నియమాలను కూడా పాటించాలి. గురువారం గురు ఆరాధనకు ప్రత్యేకంగా అంకితం చేయబడిన రోజు కాబట్టి, వారి గురువును పూజించే వారికి జీవితంలో సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.