Raj Bhang Yog 2023 : గ్రహాల రాజు అయిన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆగష్టు 17 వరకూ అదే రాశిలో సంచరించి ఆ తర్వాత సింహరాశిలోకి పరివర్తనం చెందుతాడు. మరోవైపు శుక్రుడు ఆగస్టు 05న కర్కాటక రాశి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారిపై ప్రతికూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారిపై అనుకూల ఫలితాలుంటాయి. ముఖ్యంగా మూడు రాశులవారికి మాత్రం రాజయోగమే. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
సూర్యుడు, శుక్రుడు కలసి కర్కాటక రాశిలో సంచరించడం మేషరాశివారికి శుభఫలితాలను సూచిస్తోంది. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాతపెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. కెరీర్లో దూసుకెళ్లే మార్గాలు కనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.తలపెట్టిన ప్రతి పనీ ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది.
Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలోనే సూర్యుడు -శుక్రుడు ఒకేసారి సంచరించడంతో అదృష్టం మామూలుగా లేదు. ఈ సమయంలో సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
కర్కాటక రాశిలో సూర్యుడు-శుక్రుడి సంచారం తులా రాశి వారికి హ్యాపీడేస్ ని తెస్తోంది. ఈ సమంలో ఆర్థికంగా పురోగమిస్తారు. ఉద్యోగులకు శుభసమయం. ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. పైగా ఈ రాశివారికి అధిపతి శుక్రుడుకావడంతో ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు అందరకీ కలిసొచ్చే సమయమే.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
ఆదిత్య
జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాద్యుతిం !
తమోరిం సర్వ పాపఘ్నం తం సూర్యం ప్రణమామ్యహం !!
మూల మంత్రం
ఓం ఘృణి సూర్యాదిత్యోం
సూర్య గాయత్రీ:
అశ్వధ్వజాయ విద్మహే పాశ హస్తాయ ధీమహి !
తన్నో సూర్యః ప్రచోదయాత్ !!
శుక్రుడు
హిమకుంద మృనాలాభం దైత్యానాం పరమం గురుం !
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం !!
మూల మంత్రం
ఓం ఐం కం గృహేశ్వరాయ శుక్రాయ నమః !
శుక్ర గాయత్రీ
అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి !
తన్నో శుక్రః ప్రచోదయాత్ !!
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశులలో పేర్కొన్న ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial