Horoscope Today 2023 August 3rd
మేష రాశి
ఈ రాశివారు ఎప్పటి నుంచో వసూల్ కాని బాకీలను ఈ రోజు పొందుతారు. మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. కొన్ని ప్రణాళికలు అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. కొత్త ఆలోచనలు అమలు చేయండి. వైవాహిక సంబంధంలో అన్యోన్యత పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రాశివారిలో పోటీతత్వం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలకు సమయం కేటాయిస్తారు. కొత్త పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. పాతసమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం
మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజు భాగస్వామికోసం సమయం కేటాయిస్తారు. ఆర్థిక విషయాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన లావాదేవీలు జరిపినా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి. మీరు ఎలాంటి పరిస్థితులులనైనా తెలివిగా ఎదుర్కొంటారు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త. ఇంట్లో కొంత గందరగోళం కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా లేనందున శ్రద్దతో మీకు అప్పగించిన పనులు పూర్తి చేయాలి. మీకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సోమరితనంతో సమయాన్ని వృథా చేయవద్దు. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు ఇది మంచి సమయం. వ్యాపారాభివృద్ధి బాగానే ఉంటుంది.
Also Read: బెడ్ రూమ్‌లో అద్దం అక్కడ ఉందా? జాగ్రత్త, అది మీకే నష్టం!
సింహ రాశి
విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీ ఖర్చులను నియంత్రించుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయండి.
కన్యా రాశి
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు నేటితో తీరిపోతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. పోటీ వాతావరణంలో మీ ప్రత్యర్థులను మీరు అధిగమిస్తారు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా ధైర్యంగా ముందుకు దూసుకుపోయి విజయాలు సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. వివాహితులు తమ పనుల్లో బిజీగా ఉంటారు.
తులా రాశి
ఈ రాశివారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా ఇంట్లో గొడవలు తలెత్తే అవకాశముంది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేదంటే దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. మాటను అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ వ్యవహారాలు కలసిరావు. వ్యాపార పర్యటన ఉండవచ్చు. సామాజిక సేవలో పాల్గొంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ప్రయాణాలు లాభిస్తాయి. రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వాహనం లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు, మనసులో ప్రతికూల ఆలోచనలు మీపై ప్రభావం చూపిస్తాయి. అదృష్టం మీద ఆధారపడకండి మీ పని మీరు చేయండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మతపరమైన పనులలో విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!
ధనుస్సు రాశి
ఈ రాశివారు వ్యాపారాన్ని మెరుగుపరుచుకుంటారు. ఇతరుల కన్నా వేగంగా లాభం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి. పాత మిత్రులను కలుస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.
మకర రాశి
ఈ రాశివారు సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూల సమయం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొంది,జీవితంలో స్థిరపడతారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు చాలా పనులు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. పిల్లలు సాధించిన విజయాలు మిమ్మల్ని సంతోష పరుస్తాయి. స్నేహితులను గుడ్డిగా నమ్మొద్దు. మీకు తగినంత రెస్ట్ అవసరం. మనసులో ఏదో అసంతృప్తి, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఉద్యోగులకు స్థాన మార్పు ఉండే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ పై మీకు నమ్మకం ముఖ్యం.
మీన రాశి
ఈ రాశివారికి పురోగతికి అవకాశం ఉంది. ప్రేమికులకు అనుకూలమైన సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.అవివాహితులకు వివాహ సూచన. ఇంటికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.
గమనిక: ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.