ఇంట్లో అడుగు పెట్టగానే ఒక ప్రశాంత రావాలంటే ఇల్లు వాస్తు నియమానుసారం ఉండాలి. అందుకే వాస్తును శాస్త్రంగా పరిగణిస్తారు మన సంస్కృతిలో. ఇంటి నిర్మాణంలో ప్రతి గదికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అందులో బెడ్ రూమ్ చాలా ముఖ్యమైనది. ఇంట్లో సేద తీరగలిగే ప్రశాంతమైన చోటు ఏదీ అంటే.. అది బెడ్ రూం మాత్రమే. ఇది ప్రశాంతంగా ఉండడమే కాదు చాలా పర్సనల్ స్పేస్ కూడా. వర్క్ స్పేస్ తర్వాత చాలా టైం ఇక్కడే గడుపుతాం. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకొనే వారైనా, కట్టిన ఇల్లు కొనుక్కునే వారైనా లేదా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నా కూడా బెడ్ రూమ్ ఎంత సౌకర్యంగా ఉందా, లేదా అనేది ప్రత్యేకంగా చూసుకుంటారు. ఇంట్లో ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే కాదు, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తేవడానికి కచ్చితంగా వాస్తు నియమాలను అనుసరించే ఉండాలి. బెడ్ రూం వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లో మీ ప్రియతములతో సంబంధావ్యాల మీద కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే బెడ్ రూమ్ కు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను తెలుసుకుందాం.


బెడ్ రూం ఎప్పుడూ కూడా నైరుతి దిశలో ఉండాలి. ఇలా ఉన్నపుడు ఆరోగ్యంతో పాటు సంబంధ బాంధవ్యాలు కూడా బావుంటాయి. ఈశాన్యంలో ఉంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆగ్నేయంలో ఉంటే ఇంట్లో ఎప్పుడూ గొడవలుగా ఉంటుంది. ముఖ్యంగా దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. బెడ్ కూడా నైరుతి మూలనే ఉండాలి. తల పడమర వైపు ఉండాలి. బెడ్ రూం ఎప్పుడూ కూడా ఇంటికి మధ్య భాగంలో ఉండకూడదు. ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం అంటారు. ఇక్కడ స్థిరమైన ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుంది. అందువల్ల  బెడ్ రూమ్ ఇంటి మధ్యలో  ఉంటే ప్రశాంతత లోపిస్తుంది.


బెడ్ రూమ్‌లో పాటించాల్సిన వాస్తు నిమయాలు



  1. మంచానికి ఎదురుగా అద్దం లేదా టీవీ ఉండకూడదు. మంచంలో పడుకుని ఉన్నపుడు ప్రతిబింబం కనిపించకూడదు. అలా కనిపిస్తే ఇంట్లో గొడవలు జరుగుతాయి.

  2. బెడ్ రూమ్ గోడల రంగులు సహజమైనవిగా ఉండేట్టు జాగ్రత్త పడాలి. ఎర్తీ కలర్స్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి.

  3. బెడ్ రూంలో గుడి లేదా పూజ కు సంబంధించిన ప్లేస్ ఉండకూడదు.

  4. బెడ్ రూమ్ లో నీటి ప్రవాహాలు, ఫౌంటైన్స్ వంటి పేయింటింగ్స్ ఉండకూడదు. ఇది ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ తేవచ్చు.

  5. చిన్న వెలుతురు వచ్చే లైట్స్, అరోమాటిక్ ఆయిల్స్ ఉండే డిఫ్యూజర్స్ వాడొచ్చు.

  6. నైరుతి దిశలో ఉన్న గోడను ఆనుకొని బెడ్ పెట్టుకోవడం మంచిది. ఒక వేళ అటువంటి అవకాశం లేనపుడు గోడకు బెడ్ కు మధ్య ఒక అంగుళం వదలాలి.

  7. తలుపుకు ఎదురుగా ఉండేట్టుగా బెడ్ ఏర్పాటు చేసుకోకూడదు. ఇలా ఉంటే పీడకలలు వస్తాయి.

  8. బెడ్ పిల్లర్ లేదా బీమ్ కింద ఉంటే నిద్ర పట్టదు.

  9. గదిలో ఆగ్నేయంలో నీటి జగ్ పెట్టుకుంటే నిద్ర పట్టడంలో ఇబ్బందులు వస్తాయి.

  10. బెడ్ రూం అటాచ్డ్ బాత్రూం లేదా లాండ్రీ ఏరియా తలుపు తెరచి పెట్టుకోవద్దు ముఖ్యంగా రాత్రుళ్లు.