Thursday Remedies: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి కీలక స్థానంలో ఉంటాడు. దేవతలకు అధిపతి అయిన బృహస్పతి రూపంలో ఉన్న గురుడు ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించిన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఎవరినైనా పూర్తిగా అనుకూలిస్తే వారి కష్టాలన్నీ తీరిపోతాయి. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. గ్రంధాలలో పసుపు, కుంకుమ లక్ష్మీ దేవి, బృహస్పతి అంశాలుగా వర్ణించారు. కుంకుమపువ్వు, పసుపును ఉపయోగించి కొన్ని సాధారణ నివారణలు చేస్తే, వ్యక్తి బాధ నుంచి విముక్తి పొందుతాడు. అటువంటి కొన్ని నివారణల గురించి తెలుసుకుందాం.
Also Read : అరుదైన మౌలిక నీలం పసుపు - మనదేశంలో అంతరించిపోతున్న ఔషధం ఇది
కెరీర్‌లో పురోగతి కోసం
ఏ మాసమైనా శుక్ల పక్ష అష్టమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. తూర్పు ముఖంగా కూచుని లక్ష్మీదేవిని పూజించండి. పూజలో పసుపు బంతిని ఉంచండి. లక్ష్మీ దేవిని పూజించిన తర్వాత, ఆ పసుపు బంతిని మీ అల్మారాలో ఉంచండి. ఈ రెమెడీతో కెరీర్ చాలా త్వరగా పురోగమిస్తుంది. పసుపు తిలకం నుదుటిపై ధరించడం శుభ ఫలితాలు పొందవచ్చు.
సమాజంలో ప్రతిష్ట, గౌరవం పొందేందుకు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతిచోటా విజయం, గౌరవం పొందడానికి ప్రతి గురువారం కుంకుమ తిలకం ధరించాలి. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో రూపం, సంపద, గౌరవం పొందుతాడు. దీని ద్వారా దేవతలు ప్రసన్నమై భక్తులను అన్ని విధాలుగా అనుగ్రహిస్తారు. పసుపును తిలకం రూపంలో విష్ణుమూర్తికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి.
వాస్తు దోషానికి పరిహారం
వాస్తు దోషాలను తొలగించడానికి ఈ రెండు వస్తువులను ఉపయోగించడం వల్ల ఇంట్లోని అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. పసుపును నీళ్లలో కలిపి రోజూ ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి. ఈ పరిహారంతో ఇంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఫలితంగా లక్ష్మీ దేవి రావడంతో ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
గురువారం పసుపు కొనుగోలు
వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువారం పసుపు కొనడం, ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఈ రోజు పసుపు ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల భవితవ్యం పాడైపోయి పేదవాడిగా మారతారు. కాబట్టి, ఈ రోజు ఇతరులకు పసుపు ఇవ్వడం వీలైనంత వరకు మానుకోవాలి.
Also Read : ముఖానికి పసుపు రాసుకునేటప్పుడు ఈ తప్పులు మాత్రం చెయ్యకండి
చెడు దృష్టిని వదిలించుకోవడానికి
వేరొకరి చెడు దృష్టి మీ వైవాహిక జీవితాన్ని, మీ గృహ సంతోషాన్ని క్రమం తప్పకుండా ప్రభావితం చేస్తుందని మీరు గుర్తిస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ ఇంటి ప్రధాన తలుపు వెలుపల పసుపుతో స్వస్తిక్‌ను గీయండి. ఈ పరిష్కారం మీకు ఆనందంతో పాటు అదృష్టం తెస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.