ప్రతి ఒక్కరూ సహజమైన అందంతో కనిపించేందుకే ఇష్టపడతారు. మార్కెట్లో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నా వంటింటి చిట్కాలతోనే అందంగా ఉండేందుకు చాలా మంది ట్రై చేస్తారు. మెరిసే చర్మం కోసం శనగపిండి, పసుపు, పెరుగు లాంటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వంటివి చేస్తారు. పసుపు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మంచి యాంటీ బయాటిక్ గా మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బాగా పని చేస్తుంది. పసుపు వంటలలో వేసుకునేందుకే కాకుండా చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. అయితే పసుపు ముఖానికి రాసుకునే ముందు కొన్ని చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి అందాన్ని ఇవ్వక పోగా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. చాలా వరకు పసుపుతో రోజ్ వాటర్, పాలు, నీళ్ళు కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటారు. అనవసమైన పదార్థాలని పసుపుతో జోడించి రాసుకోవడం వల్ల అది చర్మానికి హాని కలిగిస్తుంది.
పసుపు ముఖంపై ఎంతసేపు ఉంచుకోవాలి
మనం పసుపు పట్టుకుంటేనే చేతులు పసుపు రంగులో కనిపిస్తాయి. ఇక ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరయినా ఫేస్ ప్యాక్ లు మనం వేసుకున్నప్పుడు దాన్ని 20 నిమిషాలకి మించి ఉంచుకోకూడదు. అందుకు పసుపు ఏమి మినహాయింపు కాదు. పసుపుతో ప్యాక్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు దాన్ని ముఖంపై ఉంచుకుంటే ముఖమంతా పచ్చగా మచ్చలు కనిపిస్తాయి. అంతే కాదు మోతాదుకు మించి పసుపు రాసుకోవడం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.
సబ్బు అసలు వాడకూడదు
పసుపు రాసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చల్లటి నీటితో ఫేస్ కడగాలి. పసుపు రాసుకున్న తర్వాత చా మంది చేసే తప్పు ఏంటంటే సబ్బు వాడటం. అది అస్సలు చెయ్యకూడదు. పసుపుతో ప్యాక్ వేసుకున్న తర్వాత సబ్బు ఉపయోగించకూడదు. 24 లేదా 48 గంటల తర్వాత మాత్రమే ముఖాన్ని సబ్బుతో కడగాలి. తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
ముఖమంతా రాసుకోవాలి
పసుపు ప్యాక్ వేసుకున్న సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖానికి మాత్రమే వేసుకుని మిగతా ప్రదేశాన్ని వదిలి పెట్టడం వల్ల చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ప్యాక్ వేసిన ప్రదేశం పసుపుగా ఉంది మిగతా ప్రదేశం నార్మల్ గా ఉంటే చూసేందుకు బాగోదు. అందుకని పసుపుతో ప్యాక్ వేసుకునేటప్పుడు కచ్చితంగా మెడ మీద రాసుకోవాలి.
Also Read: రోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? లేక ఆరోగ్యానికి చెడు చేస్తుందా?
Also Read: విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నారా? ఇవి తింటే ఆ లోపం నుంచి బయటపడొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.