ప్రతి ఒక్కరూ ముఖం తర్వాత శ్రద్ధ చూపించేది శిరోజాల సంరక్షణకే. అందుకే చాలా మంది జుట్టు బాగుండటం కోసం వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యడం చేస్తారు. రాత్రంతా నూనె పెట్టుకుని తెల్లారగానే తల స్నానం చేస్తారు. అలా చేస్తే జుట్టు ఫ్రెష్ గా ఉండటంతో పాటు చిక్కగా అవుతుంది. కానీ ఈ హెయిర్ కేర్ అలవాటు వల్ల మొటిమల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని మీకు తెలుసా? అంతే కాదు ముఖం మీద కూడా జిడ్డు పేరుకుపోతుందని చర్మ సంబంధ నిపుణురాలు డాక్టర్ గుర్వీన్ చెప్పుకొచ్చారు. 


రాత్రంతా తలకి నూనె పెట్టుకుని ఉండటం మంచిదేనా? 


బిజీ బిజీ లైఫ్ గడిపే వాళ్ళు రాత్రి వేళ తలకి నూనె పెట్టుకుని తెల్లరిన తర్వాత తలస్నానం చేస్తారు. అలా చెయ్యడం వల్ల జుట్టు  ఫ్రెష్ గా  ఉంటుందని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదని గురవీం అంటున్నారు. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఈ హెయిర్ కేర్ కి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆమె. దీని వల్ల మొటిమలు తీవ్రతరం చేసే ప్రమాదం ఉంటుంది. ఎక్కువసేపు తల మీద నూనె ఉండటం వల్ల మీ ముఖం జిడ్డుగా మారాడమే కాకుండా చుండ్రు సమస్యని తీవ్రతరం చేస్తుంది. అంతే కాదు ముఖం మీద మొటిమలు వచ్చేలా చేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. నూనె పెట్టుకుని పడుకోవడం వల్ల తల దిండ్లు కూడా నూనెతో నానిపోతాయి. వాటి వల్ల సూక్ష్మక్రిములు వచ్చి చేరతాయి దాని వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉండి. రాత్రి పూట నూనె రాదుకోవడం వల్ల తల మాడుకు, జుట్టుకు ఏ మాత్రం సహాయపడదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తల స్నానం చేయడానికి 1-2 గంటల ముందు మాత్రమే నూనె రాసుకుని హెడ్ బాత్ చెయ్యడం ఉత్తమమని ఆమె అంటున్నారు. 


హెయిర్ స్ప్రే వాడటం చెయ్యకూడదు 


జుట్టు స్టైల్ గా ఉండటం కోసం చాలా మంది మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త జెల్, హెయిర్ స్ప్రే కొనుగోలు చేసి వాడేస్తారు. అలా చెయ్యడం వల్ల జుట్టు రాలిపోవడమే కాదు నుదిటి మీద నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వస్తాయి. కాబట్టి జుట్టు స్టైల్ గా ఉంచుకోవడం కోసం వాడే ఉత్పత్తుల వినియోగం తగ్గించుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు తల మీద పడిన దుమ్ము, జిడ్డు పోయే విధంగా శుభ్రంగా తల స్నానం చెయ్యడం మంచి పద్ధతి. జుట్టు స్టైల్ కోసం ఉపయోగించే జెల్స్ తల మాడుకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో దొరికే కొత్త వాటిని ఉపయోగించడం వల్ల అవి తల, నుదుటి మీద ప్రభావం చూపుతాయి. వాటి వల్ల ముఖం మీద నూనె రావడం జుట్టు జిడ్డుగా మరి చిరాకుగా  అనిపిస్తుంది. చెమట, దుమ్ము కలిసిపోయి జుట్టు చిట్లిపోవడం జరుగుతుంది.  


Also Read: రోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? లేక ఆరోగ్యానికి చెడు చేస్తుందా?


Also Read: విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నారా? ఇవి తింటే ఆ లోపం నుంచి బయటపడొచ్చు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.