దేవదేవుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగ‌మోక్తంగా అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ప్రధాన ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయని నమ్ముతారు.


Also Read : దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం


గురవారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవను ఆలయ అర్చకులు ఏకాంతంగా శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. ఎనిమిదోతేదీ శుక్రవారం ఉదయం చిన్నశేష వాహ‌నం, సాయంత్రం హంస వాహన సేవ ఉంటుంది. తొమ్మిదో తేదీన ఉదయం సింహ వాహ‌నం, తర్వాత స్నపన తిరుమంజనం, రాత్రికి ముత్యపుపందిరి వాహ‌న సేవ ఉంటుంది.  


Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...


పదో తేదీన ఆదివారం క‌ల్పవృక్ష వాహ‌నసవ ఉంటుంది. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం.. సాయంత్రం సర్వభూపాలవాహన సేవ ఉంటుంది. పదకొండో తేదీన ఉదయం మోహినీ అవ‌తారంతో శ్రీవారు దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ సేవ ఉంటుంది. ఏకాంతంగా నిర్వహిస్తున్నందున భక్తుల్ని అనుమతించరు. పన్నెండో తేదీన మంగళవారం  హ‌నుమంత వాహ‌న సేవ ఉంటుంది. ఇక మధ్యాహ్నం  స్వర్ణర‌థం బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌న సేవ ఉంటుంది. రాత్రికి గ‌జ వాహ‌నం మీద శ్రీవారు దర్శనమిస్తారు. 


Also Read : ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...


పదమూడో తేదీన బుధవారం ఉదయం సూర్యప్రభవాహనం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రికి చంద్ర ప్రభవాహన సేవ ఉంటుంది. పధ్నాలుకో తేదీన రథోత్సవానికిబ దులుగా స‌ర్వభూపాల వాహ‌నసేవ. రాత్రికి అశ్వ వాహనసేవ నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజు పదిహేనో తేదీన పల్లకీ ఉత్సవం.. తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్నారు. ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి ధ్వజావ‌రోహ‌ణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. 


Also Read:అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి