ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం  మే 5 న ఏర్పడుతోంది. సనాతన ధర్మం ప్రకారం గ్రహణ సమయంలో గ్రహణ సూతకం పాటించాలి. అంటే ఆహారపదార్థాల సేవనం,  నిద్రపోవడం, శుభకార్యాలు, పూజలు, పారాయణాల వంటి వాటన్నింటిని ఆపెయ్యాలి. ముఖ్యంగా గర్భిణులు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.


ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం, మే 5 బుద్ధ పూర్ణిమ రోజున ఏర్పడుతోంది. చంద్రుడు సూర్యుని మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో భూమి మీద కు నేరుగా  పడే కిరణాల తరంగ ధైర్ఘ్యం ఎక్కవగా ఉండడం వల్ల వీటిలో రేడియే షన్ ఎక్కువ అని సైన్స్ కూడా చెబుతోంది. అందువల్ల భూమి మీది పూర్తి వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. ఈ మార్పుల కారణంగా మన శరీరంలో జీవక్రియలు మందగిస్తాయి. కనుక గ్రహణం ప్రారంభం కావడానికి రెండు మూడు గంటల ముందుగానే భోజనం ముగించుకుని ఉండడం మంచిది.  


భారత కాలమానం ప్రకారం మే 5 న శుక్రవారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభమై మె6 తెల్లవారు జామున 1.02 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం అరుదైనది. ప్రతి 19 సంవత్సరాలకు ఒక సారి ఏర్పడే పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఇలాంటి చంద్రగ్రహణం తిరిగి 2042 లో సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణానికి ముందు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. కానీ ఈ సారి చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా చీకట్లో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇందుకు కారణం భూమి చంద్రుడి కంటే 5 డిగ్రీలు ఎత్తులో ఉండడం వల్ల ఇలా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లే ఇది పెనంబ్రల్ చంద్ర గ్రహణం అయింది. సాధారణంగా ఏర్పడే చంద్ర గ్రహణాన్ని అంబ్రల్ చంద్రగ్రహణం అంటారు.  చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. కనుక పెద్దగా గ్రహణ సూతకం వర్తించదు. కానీ గ్రహణ సమయంలో గర్భవతులు కొన్ని పనులు చెయ్యకూడదు. కొద్ది జాగ్రత్తలు పాటించడంలో తప్పు లేనపుడు వాటిని పరిగణన లోకి తీసుకోవడంలో తప్పులేదు.


భగవన్నామ స్మరణ


గ్రహణ సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండాలి. అందుకోసం దైవ నామ స్మరణ చేసుకోవడం, మంత్రాలు జపించడం వంటివి చేసుకోవచ్చు. ఎలాంటి ప్రతి కూల ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. గ్రహణ సమయంలో వాదోపవాదాలు, కోప తాపాలు లేకుండా ఉండాలి.


గర్భవతులు గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా చేస్తే గ్రహణ ప్రతి కూల ప్రభావాలు తల్లి బిడ్డల ఆరోగ్యం మీద పడవచ్చు.


గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. గర్భిణులు ముఖ్యంగా గ్రహణ సమయంలో నిద్రించడం వల్ల పుట్ట బోయే బిడ్డ మెదడు మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రం చెబుతోంది.


గ్రహణం ముగిసిన తర్వాత


గ్రహణం తర్వాత గర్భిణులు స్నానపు నీటిలో గంగా జలం లేదా ఏదైనా నదీ జలం కలిపి స్నానం చెయ్యలి. ఇలా చేస్తే తల్లీ బిడ్డల నుంచి గ్రహణ దోషం తొలగి పోతుంది.


Also Read: మే 5 బుద్ధ పౌర్ణమి, బోధివృక్షం పూజ - వటసావిత్రి వ్రతం రెండూ ఒక్కటేనా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.