Bhagavad Gita: శ్రీమద్భగ‌వద్గీత హిందువుల పవిత్ర గ్రంథం. మానవ జీవితం మొత్తం సారాంశం ఇందులో వివరించారు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశ సారాంశాన్ని భగవద్గీత మనకు వివరిస్తుంది. గీతలో బోధనలు నేటికీ సజీవంగా ఉండ‌ట‌మే కాకుండా మ‌న‌కు సరైన జీవన విధానాన్ని చూపుతాయి.


జీవిత పరమార్థం భగవద్గీతలో చాలా స్ప‌ష్టంగా వివరించారు. భగవద్గీత బోధనలను తన జీవితంలో ఆచ‌రించే వ్యక్తి ఎప్పటికీ ఓటమిని అనుభవించడు. జీవితంలో అప‌జ‌యం ఎదుర‌వ‌కూడ‌దంటే ఏం చేయాలో తెలుసా..?


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. కాలం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికీ ఒకేలా ఉండలేము. ఇతరులను అనవసరంగా ఏడిపించే వారు కూడా ఏదో ఒక రోజు ఏడవాల్సిందే. ఇతరులను బాధపెట్టేవారు ఈ రోజు కాక‌పోయినా రేపు తమ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారని శ్రీకృష్ణుడు తెలిపాడు.


తెలివైన వ్యక్తి లక్షణాలు
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు జ్ఞాని ఎలా ఉంటాడో వివరించాడు. గీత ప్రకారం, చాలా సున్నితత్వం, స్థిరమైన మనస్సు కలిగిన వ్యక్తి విజయం సాధించినప్పుడు గర్వించడు, అదే విధంగా వైఫల్యం వచ్చినప్పుడు దుఃఖంలో మునిగిపోడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతాడు.


స్వావలంబన
పిరికివారు, బలహీనులు మాత్రమే తమ జీవితంలో ఏదైనా జ‌ర‌గాలంటే విధిపై ఆధార‌ప‌డ‌తారు. అలాంటివారు అన్నింటికీ విధిని నిందిస్తార‌ని భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ కృష్ణుడు చెప్పాడు. మరోవైపు, బలమైన, స్వావలంబన కలిగిన వారు ఎప్పుడూ అదృష్టం లేదా విధిపై ఆధారపడరు.


మంచిత‌నం నటించడం మానేయండి
భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ ఎదుటివారి కోసం మంచివాడిగా నటించకూడదు. ఎందుకంటే మీరు మానవుల నుంచి ప్రతిదీ దాచవచ్చు. కానీ, దేవుని నుంచి ఏదీ దాచలేరు. భ‌గ‌వంతుడికి మీ గురించి బయట నుంచి మాత్రమే కాకుండా లోపల నుంచి కూడా మొత్తం తెలుసు. కాబట్టి మనలో మనం ఏ మార్పు చేసుకోవాలనుకున్నా అది పూర్తిగా మన కోసమే అయి ఉండాలి.


ఆలోచనే సుఖ దుఃఖాలకు మూలం
మీరు సంతోషంగా ఉన్నా, దుఃఖంతో ఉన్నా రెండూ మీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటాయి అని శ్రీ కృష్ణుడు చెప్పాడు. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కానీ మీరు మీ మనస్సులో పదే పదే ప్రతికూల ఆలోచనలతో ఉంటే మీరు దుఃఖంలో మునిగిపోతారు. ప్రతి వ్యక్తికి త‌న‌ ఆలోచనే శత్రువు లేదా మిత్రుడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.


Also Read : నిజ‌మైన‌ ఆదిపురుషుడు ఎవ‌రో తెలుసా!


ఇతరులపై ఆధారపడటం తప్పు
ఇతరులపై ఆధారపడటం లేదా అతి విశ్వాసంతో ఎవరితోనైనా పోటీప‌డ‌టం వల్ల మీకు ఎలాంటి సంతోషం లేదా లక్ష్య సాధన జరగదని భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ కృష్ణుడు స్ప‌ష్టంగా వివ‌రించాడు. అందుకే మనిషి ఎప్పుడూ తన పనులను విశ్వసిస్తూ ఒంటరిగా నడవాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.