కర్ణాటకలో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయానికి ఎప్పుడైనా వెళ్లారా. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉండే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు" వల్మీక మృత్తికా" అంటే పుట్ట మన్ను ప్రసాదంగా అందిస్తారు. ఈ ప్రసాదాన్ని ఎలా వినియోగించాలంటే...



  • మృత్తికా ప్రసాదాన్ని ధరించినవారికి నాగుల భయం, నాగదోషం తొలగి నాగదేవతల అనుగ్రహం ఉంటుంది.

  • కొందరికి నిత్యం కలలో పాములు కనిపిస్తుంటాయి. ఎన్నిచేసినా ఆ భయం అలాగే ఉండిపోతుంది. అలాంటివారు ఈ ఆలయంలో మృత్తికా ప్రసాధాన్ని ధరిస్తే ఆ భయం తొలగిపోతుంది.

  • కొందరు ఆడపిల్లలకు రకరకాల దోషాల వల్ల వివాహం జరగదు. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లికుదరదు. ఏ కారణం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయో కూడా అర్థంకాదు. వరుసగా ఇలాగే జరిగితే ఆ అమ్మాయితో పాటూ ఆ కుటుంబంలో సభ్యులు కూడా డిప్రెషన్ కి లోనవుతారు. అలాంటి సమస్య ఉన్నవారు సుబ్రమణ్య స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను, కొంచెం పసుపును నీటిలో వేసుకుని స్నానమాచరించి..దేవుడికి నేతితో దీపాన్ని వెలిగించి ప్రార్థిస్తే త్వరగా వివాహం జరుగుతుంది.

  • ఊరికే వసపిట్టలా వాగుతుంటారు కొందరు..పుట్టుకతో వచ్చిన లక్షణమో ఏమో ఎంత కంట్రోల్ చేసినా వారి మాటలు ఆపడం ఎవ్వరి వల్లా కాదు. ఓ చిటికెడు మృత్తికను కొబ్బరినూనెలో వేసి తలకు రాసుకుంటే అతిగా మాట్లాడటం తగ్గుతుందట.

  • పిల్లలు చాలామంది పళ్లు కొరకడం, చీటికి మాటికీ కిందపడి కొట్టుకోవడం, అలాగే ఓ వైపు చూస్తుండిపోవడం, అదే పనిగా ఏడుస్తుండడం, ఎంత తింటున్నా సన్నబడడం లాంటి లక్షణాలుంటే సుబ్రమణ్యస్వామిని ధ్యానించి ఆ మృత్తికను తీసుకుని బొట్టుగా పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారట.

  • రుతుక్రమం సమయంలో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న వారు... రుతుక్రమం వచ్చేముందు చిటికెడు మృత్తికను పొడిచేసి కొబ్బరినూనె లేదా ఆముదంలో వేసుకుని పొడిచేసుకుని పొట్టపై రాసుకుంటే ఆ నొప్పి రాదని చెబుతారు.

  • కష్టపడి చదివినా మరిచిపోయే విద్యార్థులు కూడా చిటికెడు ముత్తికను నైట్ మొత్తం గ్లాసు వాటర్లో నానబెట్టి ఉదయాన్నే తాగితే మరుపు తగ్గుతుంది.

  • సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజ చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టిన పాలలో ఒక చిటికెడు మృత్తికాను వేసి దేవునికి చూపించిప్రార్ధన చేసుకొని తాగితే స్వామివారి అనుగ్రహం ఉంటుందంటారు.

  • ఎవరింట్లో అయినా తులసి మొక్,క తమలపాకు ఆకులు ఎండిపోతుంటాయో ఓ కుండలో చిటెకెడు స్వామివారి మృత్తిక వేసి మొక్కవేస్తే పచ్చగా ఎదుగుతాయట.

  • చర్మం పొడిబారి నాగఫణి రోగాన్ని అనుభవించేవారు, నీరసంతో ఇబ్బందిపడేవారు సుబ్రమణ్యస్వామి చిటికెడు మృత్తికను నీటిలో వేసి సాయంకాలం వేళ స్నానం చేస్తే ఆ ప్రభావం తగ్గుతుందట. 


నోట్: కొందరు పండితులు, కొన్ని బుక్స్, స్థానికంగా ప్రచారంలో ఉండే విషయాల ఆధారంగా రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలో పూర్తిగా మీ వ్యక్తిగతం....


Also Read: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి


Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!


Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే