భూమ్మీద జీవించే కష్టజీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయి. పూవు పూవుకి తిరిగి తేనెను తెచ్చి తుట్టెగా మార్చి మనకి అందిస్తాయి. తేనె మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. తేనెటీగలను పెద్దగా పట్టించుకోము కానీ, అవే లేకపోతే మనిషి ఎక్కువ కాలం ఈ భూమిపై జీవితం గడపలేడు. ఇదేదో మేం చెబుతున్నది కాదు పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలే చెబుతున్నారు. భూమ్మీద బతికే హక్కు మనకు ఎంతుందో మిగతా జీవరాశులకూ అంతే ఉంది. కానీ మనిషి తన అవసరాల కోసం మిగిలిన జీవుల ఉనికిని దెబ్బతీస్తున్నాడు. జీవ వైవిధ్యం కరువైతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. చివరికి ఆ ప్రభావం పడేది మనిషి మీదే. 


బతుకు నాలుగేళ్లే...
తేనెటీగలే ఈ భూమ్మీద లేకపోతే ఏమవుతుందో తెలుసా? భూమ్మీద జీవించే ఇతర జీవులేవీ ఎక్కువ కాలం జీవించలేవు.చివరికి మనిషి కూడా. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు చెప్పిన ప్రకారం తేనెటీగలు లేని భూమ్మీద మనిషి కేవలం నాలుగేళ్లు మాత్రమే బతకగలడు. మిగత జీవులు కూడా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంటాయి. సముద్ర జీవులు మాత్రమే జీవించి ఉంటాయి. భూమి మిగతా జీవరాశి లేని గ్రహాల్లా మారిపోవడం ఖాయం. గతంలో ఐన్ స్టీన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు ‘తేనెటీగలు లేకపోతే మనిషి నాలుగేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించడం కష్టం’ అని. 


అంతరించిపోతున్నాయి...
ప్రపంచవ్యాప్తంగా  ఉన్న తేనెటీగల సంఖ్య ప్రమాదంలో పడింది. దాదాపు 90 శాతం తేనెటీగలు అంతరించిపోయాయి. ఇంకా పదిశాతం మాత్రమే మిగిలాయి. చెట్లు, మొక్కలు, పువ్వులు తరిగిపోవడంతో అవి ఆహారం లేక తుట్టె ఎక్కవ కట్టుకోవాలో తెలియక మరణిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని ల్యాబ్ లలో ప్రత్యేకంగా పెంచుకోవావల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. 


ఎందుకంత అవసరం?
తేనెటీగల వల్లే కేవలం తేనెగా లభిస్తోంది, అది లేకపోతే ఏమవుతుంది అనుకోవద్దు... ప్రపంచంలో మనిషి పండించే పంటలు 100 రకాల దాకా ఉంటాయి. వాటిలో 90 రకాల పంటలు ఫలదీకరణం చెందాలంటే తేనెటీగలు అవసరం. అంటే 70 శాతం వ్యవసాయం తేనెటీగల వల్లే జరుగుతోంది. అందుకే తేనెటీగలు తగ్గితే పంటలపై తద్వారా ప్రపంచఆహారంపై ప్రభావం పడుతుంది.మనం తాగే ఒక స్పూను తేనెను సేకరించడం కోసం కొన్ని వేల పూలను ఆశ్రయిస్తాయి తేనెటీగలు. 


ఫోన్ వాడకం...
సెల్ ఫోన్ అధికంగా వాడడం వల్ల కూడా తేనెటీగలు అంతరించిపోతున్నట్టు చెబుతున్నా శాస్త్రవేత్తలు. సెల్ ఫోన్ సిగ్నల్స్ తేనెటీగలు దారిని మార్చేస్తున్నాయి. తాము కట్టుకున్న గూడుకు వెళ్లే దారిని అవి మర్చిపోయేలా చేస్తున్నాయి. ఒంటరిగా మారిన తేనెటీగలు చివరకు మరణిస్తున్నాయి. 


మనిషి భూమిపై సంపూర్ణ జీవితం గడపాలంటే మిగిలిన జీవరాశిని కూడా కాపాడుకోవాలి. 


Also read: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి



Also read: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే