Ugadi Wishes in Telugu 2023

చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ

బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం.మొదటి నెల చైత్రం.మొదటి తిథి పాడ్యమి.మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభానిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదాఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూతెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!

Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!

ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

గతించిన కాలాన్ని మర్చిపోవాలికొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు

తీపి-చేదు కలిసినదే జీవితంకష్టం-సుఖం తెలిసినదే జీవితం ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని   కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!

మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత కొచ్చింది వేప కొమ్మకు పూవు పూసిందిపసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను  అందించాలని ఆకాంక్షిస్తూ  శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం  అదే ఉగాది పండుగ సందేశంమీకు మీ కుటుంబ సభ్యులకు  శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూశ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!