Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024:  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 మిథున రాశి ఫలితాలుమిథన రాశి(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4

Also Read: 2023-2024 మేషరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....

ఈ రాశివారికి సప్తమ రాజ్యాధిపతి, ధనం, సంపత్తుకారకుడైన గురువు శుభసంచారం చేస్తున్నాడు. అష్టమ శని తొలగిపోయినందున అన్ని రంగాల వారికి శుభసమయం. ఆర్థికంగా పుంజుకుంటారు, సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. శని, రాహు బలంవల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంకా మిథున రాశివారికి శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉందంటే...

  • ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు
  • బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది, శత్రువులే మిత్రులుగా మారుతారు
  • కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది
  • స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, వాహనయోగం ఉంది, పుణ్యక్రేత్రాలు సందర్శిస్తారు
  • తనకన్నా చిన్నవారివల్ల బాధలున్నప్పటికీ లెక్కచేయరు, గుప్త శత్రువులు ఉన్నప్పటికీ వాళ్లు మిమ్మల్నేం చేయలేరు
  • అన్నిరంగాలవారికి ఆదాయం బావుంటుంది
  • నరఘోష, దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది
  • నూతన వ్యక్తుల పరిచయాల వలన సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది
  • అవివాహితులకు ఈ ఏడాది పెళ్లిజరుగుతుంది
  • ఉద్యోగులకు అద్భుతంగా ఉంది...గతంలో మిమ్మల్ని అవమానపర్చినవారే మీ దగ్గరకు వచ్చిమరీ ప్రశంసిస్తారు, ఉన్నతాధికారులు మీ మాటకు విలువనిస్తారు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది
  • కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ ఏడాది పర్మినెంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
  • మీ ప్రవర్తనలో ఊహించని మార్పులొస్తాయి
  • ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది
  • విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు
  • రాజకీయనాయకులకు ఈ ఏడాది బావుంటుంది..అన్నింటా మీదే విజయం,పదవీ ప్రాప్తి లభిస్తుంది
  • కళాకారులకు, టీవీ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది
  • అన్నిరంగాల వ్యాపారులకు కలిసొస్తుంది... ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందుతారు
  • మిథున రాశి విద్యార్థులకు ఈ ఏడాది గురుబలం బావుంది..జ్ఞాపకశక్తి పెరుగుతుంది..ఇతరవ్యాపకాలపై కాకుండా చదువుపై శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షలలో ర్యాంకులు పొందుతారు
  • క్రీడాకారులకు మంచి సమయం..ఆటల్లో విజయం సాధిస్తారు
  • వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసొస్తాయి..ఇంట్లో శుభకార్యాలు చేస్తారు
  • పునర్వసు నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి
  • పుష్యమి నక్షత్రం  వారికి ఆధ్యాత్మిక ఉన్నతి
  • ఆశ్లేష నక్షత్రం  వారికి వ్యాపార లాభం, ధన వృద్ధి

ఓవరాల్ గా చూస్తే గడిచిన మూడు నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మిథున రాశివారికి కొంత రిలీఫ్ ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అష్టమ శని ప్రభావం తొలగిపోవడంతో అన్నింటా విజయం వరిస్తుందని..ధైర్యంగా ముందడుగేస్తారంటున్నారు...

Also Read: 2023-2024  వృషభరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.