Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024:  శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మేషరాశి ఫలితాలు
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6


శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో (2023-2024) మేషరాశివారికి... భాగ్య, వ్యయాధిపతి  అయిన గురువు జన్మరాశిలో సంచరిస్తున్నందున గతంలో కన్నా శుభఫలితాలనే అందించనున్నాడు. శని పదకొండో స్థానంలో ఉండడం కొంత ఉపశనమం. జన్మంలో రాహుకేతువుల ప్రభావం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. పదకొండో స్థానంలో ఉన్న శనివల్ల ఎలాంటి చిక్కు సమస్యలను అయినా పరిష్కరించుకోగలుగుతారు


Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి



  • ఈ ఏడాది మేష రాశివారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, స్థిరాస్థిని వృద్ధి చేస్తారు

  • సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది

  • సంతానం కారణంగా ఆనందంగా ఉంటారు

  • జన్మంలో రాహువు సంచారం వల్ల కొన్ని అశుభవార్తలు వినాల్సి వస్తుంది, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి, మానసికంగా కుంగిపోతారు, కొన్నిసార్లు చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది

  • ఉద్యోగులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి.స్థానచలనం, దూరప్రాంతాలకు బదిలీలు తప్పవు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.. పై అధికారులతో మాటలు పడడం తప్పదు. అయితే శని బలం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది, నిరుద్యోగులకు ఈ ఏడాది కూడా నిరాశ తప్పదు

  • గృహనిర్మాణాలు పూర్తిచేస్తారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

  • ఈ ఏడాది ఈ రాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రజల్లో - అధిష్టానం నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు

  • కళాకారులకు ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు. టీవీ రంగంలో ఉన్న వారికి ఫలితాలు అంతంతమాత్రమే

  • వ్యాపారుల విషయానికొస్తే.. హోల్ సేల్, రిటైల్ రంగంలో ఉన్నవారికి బావుంటుంది. ఫైనాన్స్, ఆభరణాల వ్యాపారం చేసేవారికి నష్టం తప్పదు. ఇనుము, ఇసుక, ఇటుక, సిమెంట్ వ్యాపారం చేసేవారికి లభాలొస్తాయి

  • షేర్ మార్కెట్ చేసేవారికి మిశ్రమ ఫలితాలుంటాయి

  • విద్యార్థులకు గురుబలం లేకపోవడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది, ఇతర వ్యాపకాలపై మనసు మళ్లుతుంది. ఇంజినీరింగ్, మెడికల్ సహా పలు ఎంట్రన్స్ టెస్టులు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందలేరు

  • వ్యవసాయదారులకు కూడా ఓ పంట లాభిస్తుంది..రెండో పంట నష్టాన్ని మిగులుస్తుంది.

  • ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు

  • ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం, ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయరాదు

  • జూన్ 17 నుంచి శని వక్రం వల్ల సుమారు నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవు...అధిక కృషి చేసినా సాధారణ ఫలితాలు మాత్రమే పొందుతారు. నవంబరు ప్రారంభం నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి

  • అశ్విని నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏప్రిల్ 21 వరకూ అన్నీ శుభాలే

  • భరణి నక్షత్రం వారికి అధికారయోగం

  • కృత్తిక నక్షత్రం వారికి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 


నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం