Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024: శ్రీ శుభకృత్ నామ సంవత్సరాన్ని పూర్తిచేసుకుని శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 లో శోభకృత్ నామసంవత్సరం 37వది. గతంలో 1963 - 1964 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2023 - 2024లో వస్తోంది. మరి ఈ సంవత్సరంలో ఏ రాశివారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో చూసుకోండి...
మేష రాశి
( అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం )
ఆదాయం: 5 , వ్యయం:5 , రాజపూజ్యం:3 , అవమానం:1
వృషభ రాశి
( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు)
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1
మిథున రాశి
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4
కర్కాట రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం : 11 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
సింహ రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం:1 అవమానం : 7
కన్యా రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 4 అవమానం : 7
తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం:7 అవమానం : 7
వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3
ధనస్సు రాశి
మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం : 8 వ్యయం :11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3
Also Read: శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఎప్పుడొచ్చింది, పంచాంగ శ్రవణం ఎందుకు!
మకర రాశి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6
కుంభ రాశి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6
మీన రాశి
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం :1 అవమానం : 2
ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం
ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుస్తారు..ప్లాన్ ప్రకారం ఖర్చుచేస్తారని అర్థం
ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి...ఎంత కష్టపడినా చేతిలో డబ్బులు మిగలవు అని అర్థం
ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చుపెట్టేస్తారు- అంటే లాభం నష్టం రెండూ ఉండవన్నమాట.
రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించే వారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి
రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొగిడేవారి కన్నా తిట్టేవారి సంఖ్యే ఎక్కువన్నమాట
రాజపూజ్యం-అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు...
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.