మేష రాశి

ఈ రాశివారికి ఒకేసారి పనిఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా కోపానికి లోనవుతారు..కానీ మీ పనిని మీరు పూర్తిచేయడమే మంచిదని గుర్తించాలి. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మీరు మీ ప్రాధాన్యతలు గుర్తించి ప్రణాళికలు వేసుకోవడం మంచిది. కుటుంబానికి సమయంక కేటాయించండి

వృషభ రాశి

ఏదో ఒక విషయం మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఆలోచింప చేసేలా చేస్తుంది. ఈ విషయంలో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో విజ్ఞతతో వ్యవహరించాలి, సహనంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు కాస్త సంయమనం పాటించడం మంచిది

మిధున రాశి

భారీ రుణాలు తీసుకోవాలన్న సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు చేతికందుతాయి. కోపం తగ్గించుకోండి..వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీ ఆర్థిక జీవితానికి శుభ సంకేతాలు రావొచ్చు.

Also Read: ఈ వారం ఈ రాశివారు మాటతీరు, ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి!

కర్కాటక రాశి

ఈ రాశివారు అహాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే అనుకోనిది జరగొచ్చు. మీ తోబుట్టువులతో మీ సంబంధం క్షీణించే అవకాశం ఉంది. ఏదో ఆలోచనలో ఉన్నట్టే కనిపిస్తారు..వీటన్నింటి నుంచి బయటపడకోపోతే మీకు మీరే నష్టం చేసుకున్నట్టవుతుంది.

సింహ రాశి

మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. వారికి సమయం కేటాయించడం ద్వారా మీ భవిష్యత్ కి కొన్ని ప్రణాళికలు రూపొందిచుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

కన్యా రాశి 

అవివాహితుల సంబంధాల వేట ఓ కొలిక్కి వస్తుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించండి. తోడబుట్టినవారితో మీకున్న దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 

తులా రాశి

కుటుంబంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనుల్లో ప్రతికూలత ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ముందడుగు వేస్తారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. పని విషయంలో నిర్లక్ష్యం వీడండి.

Also Read: ఈ వారం ఈ రాశివారికి మంచి అవకాశం రాబోతోంది,ఆదాయం పెరుగుతుంది - మార్చి 13 -19 వారఫలాలు

వృశ్చిక రాశి 

పనిలో సీనియర్లతో చాలా పరస్పర చర్చ ఉంటుంది. కార్యాలయంలో మీరు సహాయం పొందుతారు. భవిష్యత్ కి ఉపయోగపడే మార్గదర్శకత్వం పొందుతారు. పని విషయంలో మీ సిన్సియారిటీ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ రాశి విద్యార్థులు మరింత కష్టపడాలి. వ్యాపారం బాగానే సాగుతుంది

ధనుస్సు రాశి

ఈ రోజు జీవితంలో ఆహ్లాదకరమైన రోజు , కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు. ఇంట్లో మీ గురించి సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కార్యలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.

మకర రాశి 

ఈ రాశి వ్యాపారులు వ్యాపార విషయాలలో జాగ్రత్తగా ఉండండి..మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త పడండి. శత్రువులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా వ్యవహరించండి. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు.

కుంభ రాశి 

ఈ రాశివారికి చంచలమైన స్వభావం ఉంటుంది. ఏదో విషయంలో చికాకు మీపై ఆధిపత్యం చెలాయిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత కొంత మార్పు వచ్చి ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆకస్మిక ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణ ఫలితాలున్నాయి. 

మీన రాశి 

మీరు ఈరోజు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. కానీ బలమైన సంకల్ప శక్తితో మీరు దానిని ఓడించగలరు. కుటుంబానికి సమయం కేటాయించండి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే కోపం తగ్గించుకోవాలి.