Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 తులా రాశి ఫలితాలు
తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం:7 అవమానం : 7
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప తులా రాశివారికి యోగకాలమనే చెప్పాలి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. స్వశక్తితో రాణిస్తారు.2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ తులారాశివారికి ఎలాఉందంటే..
- గృహ జీవితంలో ఆనందం ఉంటుంది, సౌకర్యాలకు ఎలాంటి లోటు ఉండదు, ఆనందంగా ఉంటారు
- పుణ్యనదీస్నానం, తీర్థయాత్రలు చేస్తారు, శక్తికి మించిన కార్యాలు నిర్వహిస్తారు
- స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, జీవన విధానంలో మార్పులుంటాయి
- ఆరోగ్యం బాగానే ఉంటుంది
- అవివాహితులకు ఈ ఏడాది పెళ్లిజరుగుతుంది
ఉద్యోగులకు
శ్రీ శోభకృత్ నామసంవత్సరం తులా రాశి ఉద్యోగులకు ప్రథమార్థం అంత అనుకూలంగా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు దూరప్రాంత బదిలీలు జరుగుతాయి. లేనిపోని నిందలు మోయాల్సి వస్తుంది.ద్వితీయార్థం మాత్రం యోగకాలమే. అప్పటివరకూ ఉన్న ఇబ్బందులు సమసిపోతాయి. కాంటాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులకు కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఉద్యోగాలొస్తాయి.
విద్యార్థులకు
విద్యార్థులకు ఈ సంవత్సరం పర్వాలేదనిపిస్తుంది. జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది కానీ ఇతర వ్యాపకాలపై కూడా శ్రద్ధ ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు కానీ ఆశించిన స్థాయిలో మార్కులు సంపాదించలేరు. ఎంట్రన్స్ పరీక్షల్లో సీట్లు మాత్రం పొందగలరు
వ్యాపారులకు
తులారాశి వ్యాపారులకు ఈ ఏడాది మిశ్రమఫలితాలున్నాయి. హోల్ సేల్,రీటైల్ వ్యాపారులు లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా ఉండదు. నిర్మాణ రంగానికి చెందిన వ్యాపారులు లాభపడతారు
కళారంగం వారికి
తులా రాశికి చెందిన కళారంగం వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది..మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి.అవార్డులు, రివార్డులు సాధిస్తారు
రాజకీయనాయకులకు
తులారాశి రాజకీయనాయకులకు శోభకృత్ నామసంవత్సరం అనుకూలంగా లేదు. గ్రహసంచారం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రజల్లో మీపై ఉన్న విశ్వాసం తగ్గుతుంది. అధిష్టాన వర్గంలోనూ మీపేరు, గుర్తింపు తగ్గుతుంది. శత్రువులవలన ఇబ్బందులు ఉండొచ్చు. నమ్మినవారే దగాచేస్తారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది కానీ ఫలితం ఉండదు
వ్యవసాయదారులకు
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట లాభిస్తుంది. కౌలుదారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అప్పులు తీర్చలేరు. పండ్లతోటలు నిర్వహించేవారు లాభాలు పొందుతారు. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలున్నాయి.
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
- తులా రాశికి చెందిన చిత్త నక్షత్రం వారికి కార్యసిద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగంలో విజయం ఉంటుంది
- స్వాతి నక్షత్రం వారికి ఇంట్లో నిత్యకళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది
- తులా రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి అపవాదులు తొలగి అన్నింటా జయం లభిస్తుంది
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.