Pradosha Mahatmyam:  మహాశివరాత్రి పంచాక్షరి జపం సకల పాపాలను హరిస్తుంది. ఈ రోజు ప్రదోష సమయంలో శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయని చెబుతారు.. ఈ సమయంలో చదవాల్సిన స్తోత్రం ఇదే..


శివప్రదోష స్తోత్రం


కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః


Also Read: తేలిక పదాలతో బరువైన శివతత్వాన్ని చూపించిన రామజోగయ్య శాస్త్రి... 'శివా శివా శంకరా' సాంగ్ అందుకే సూపర్ హిట్!


ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని 'జ్యోతి'గా వర్ణించింది వేదం. అన్నిటిలో లీనమై ఉంటూ అన్నింటినీ తనలో లయం చేసుకునేది కనుకే అది జ్యోతిర్లింగం అయింది. ఆది మధ్య అంతం లేని అఖండ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం అనాధిగా కొనసాగుతున్న సంప్రదాయం. హిమాలయాల్లో ఉన్న కేదారేశుని మొదలు..రామేశ్వరం వరకూ మనదేశంలో ఆసేతు హిమాచలం ఎన్నో ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 


కేవలం మహాశివరాత్రి పర్వదినం రోజే కాదు..ఏడాదిలో ఎన్నో వారాలు, తిథులు శివార్చనకు ప్రత్యేకమైనవని ఆగమాలు వివరించాయి.  


ప్రతినెలా వచ్చే బహుళ చతుర్దశిని 'మాసశివరాత్రి'గా జరుపుకుంటారు.. ఈ రోజు పంచాక్షరి జపిస్తూ అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు


మాఘమాసంలో  కృష్ణపక్ష చతుర్దశిని 'మహాశివరాత్రి'గా జరుపుకుంటారు. ఈ రోజు చేసే ఉపవాసం, జాగరణ, అభిషేకం రెట్టింపు ఫలితాలన్నిస్తాయి


Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!
 
ఉపవాస, జాగరణల సమయంలో శివనామ స్మరణ, మంత్రజపం, అర్చన, అభిషేకం, సంకీర్తన, ధ్యానం, లీలాకథా శ్రవణం, భస్మ రుద్రాక్షధారణ ఇవన్నీ పాటిస్తారు. మహాశివరాత్రి పర్వదినం అంటే 'శివధర్మవృద్ధి కాలం' అని చెబుతోంది శివపురాణం. ఈ శివధర్మాలలో ఏ ఒక్కటి ఆచరించినా విశేష ఫలితాలు అందుకుంటారని పురాణాల్లో ఉంది.  


ధ్యాన సమాధికి సంకేతమైన శివరాత్రిలో అర్ధరాత్రి సమయాన్ని 'లింగోద్భవ 'కాలం' అంటారు.  ఈ సమంలో శివయ్యకు పూజలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రదోష సమయంలో శివారాధన కూడా అంతే విశిష్టమైనది అంటారు పండితులు.


మహాశివరాత్రి పర్వదినాన ప్రదోష సమయంలో శివపూజ పుణ్యఫలం...
ఓం నమఃశివాయ


Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!


పానపట్టంపై శివలింగం అంటే మానవుడి హృదయపద్మంపై ఆత్మలింగంతో సమానం


శివయ్యకు చేసే పంచామృతాభిషేకం  అంటే ఏంటో తెలుసా... అవే భక్తి, మంత్ర జపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనం...వీటితో చేసేదే అసలైన దైవాభిషేకం.  


అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నమే జలధారపాత్ర


శివ లింగం జీవాత్మకు సంకేతం అయితే.. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేసేదే అభిషేకం


నిర్గుణ పరతత్వ స్వరూపం అయన శివుడిని భక్తులు ఏరూపంలో పూజించినా, ఎలా అర్చించినా కరుణిస్తాడు


ఎలా పూజించినా అంతర్గతంగా ఉండే పరతత్వం ఒకటే..ఈ పరతత్వానికి రూపం లేదు..ఈ సత్యాన్ని తెలియజెప్పే తత్వ స్వరూపమే శివలింగం..