రామాయణం చదవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది.అయితే చదివే అవకాశం ఉన్నవారు చదివి ఉంటారు, అవకాశం లేనివారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు వర్గాల వారికోసమే ఈ ప్రశ్నలు. వీటిలో మీకు ఎన్నింటికి సమాధానం తెలుసో చెక్ చేసుకోండి..
Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం
Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం Part 2
Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం Part 3
( పై లింక్స్ లో 75 ప్రశ్నలు-సమాధానాలు ఉన్నాయి..వాటికి కొనసాగింపే ఈ కథనం)
76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో ఉన్నాడు?దక్షిణ దిక్కు
77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతుడికి ఏమిచ్చాడు?తన (రామ) పేరు చెక్కి ఉన్న ఉంగరం
78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?స్వయంప్రభ
79. సముద్రం అమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరు?సంపాతి
80. హనుమంతుడి తల్లి అంజన అసలు పేరు?పుంజికస్థల
81. ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరు?మహేంద్రపర్వతం
82. వాయుపుత్రుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?మైనాకుడు
83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి?సురస
84. అంజనీ సుతుడి నీడను ఆకర్షించి తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేంటి?సింహిక
85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?నూరు యోజనములు
86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరు?లంబ పర్వతం
87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?అశోక వనం
88. రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చాడు?రెండు
89. రాముడికి విజయం, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?త్రిజట
90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడినట్లు ఎవరి కథ వినిపించాడు?రామ కథ
91. రామునికి నమ్మకం కలుగేందుకు సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేంటి?చూడామణి
92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?ఎనభై వేలమంది
93. హనుమంతుడిని ఎవరి అస్త్రంతో బంధించి రావణుని వద్దకు తీసుకెళ్లారు?ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం
94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?విభీషణుడు
95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?మధువనం
96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు
97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?ఆలింగన సౌభాగ్యం
98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటినీలుడు
99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించాడు?నికుంభిల
100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రం ఉపదేశించిన ముని ఎవరు?అగస్త్యుడు
101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?ఇంద్రుడు
102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?మాతలి
103. రావణ వధానంతరం లంకనుంచి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది? కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపాడు?హనుమంతుడు
105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరు?శత్రుంజయం
106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?స్వయంగా తన భవనమునే ఇచ్చాడు
107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం ఎవరు తయారు చేశారు?బ్రహ్మ
108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏంటి?తన మెడలోని ముత్యాలహారం
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే