రామాయణం చదవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది.అయితే చదివే అవకాశం ఉన్నవారు చదివి ఉంటారు, అవకాశం లేనివారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు వర్గాల వారికోసమే ఈ ప్రశ్నలు. వీటిలో మీకు ఎన్నింటికి సమాధానం తెలుసో చెక్ చేసుకోండి..
Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం
Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం Part 2
( పై లింక్స్ 50 ప్రశ్నలు-సమాధానాలు ఉన్నాయి..వాటికి కొనసాగింపే ఈ కథనం)
51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చారు?
జనస్థానము
52. సీతను అపహరించుటానికి రావణుడు ఎవరి సహాయ కోరాడు?
మారీచుడు
53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
బంగారులేడి
54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం చేసిన పక్షి ఎవరు?
జటాయువు
55. సీతను అన్వేషిస్తున్న రామలక్ష్మణులకు అరణ్యంలో మృగాలు ఏ దిక్కుకు సంకేతం చూపెను?
దక్షిణపు దిక్కు
56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తంలో చిక్కుకున్నెనారు?
కబంధుని
57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
మతంగ వనం, పంపానదీ
58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివశించారు?
ఋష్యమూక పర్వతం
59. రామలక్ష్మణుల గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపాడు?
హనుమంతుడు
60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
అగ్ని సాక్షిగా
61. రాముడు తన బాణాలు దేనితో తయారు చేసినట్టు సుగ్రీవుడికి చెప్పాడు?
కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు
62. సుగ్రీవుని భార్య పేరు?
రుమ
63. వాలి భార్యపేరు?
తార
64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
కిష్కింధ
65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేంటి?
మాయావి.
66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
దుందుభి
67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడింది?
మతంగముని
68. వాలి కుమారుని పేరేంటి?
అంగదుడు
69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షాలు భేదించాడు?
ఏడు
70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించారు?
ప్రసవణగిరి
71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
వినతుడు
72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
అంగదుడు
73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపిన సుషేణునికి బంధుత్వం ఏంటి?
మామగారు, తార తండ్రి
74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
శతబలుడు
75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చాడు?
మాసం (ఒక నెల)
Also Read: త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన కల విన్నాక ఏడుపు ఆపిన సీతాదేవి, ఇంతకీ ఎవరీ త్రిజట
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే