రామాయణం చదవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది.అయితే చదివే అవకాశం ఉన్నవారు చదివి ఉంటారు, అవకాశం లేనివారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు వర్గాల వారికోసమే ఈ ప్రశ్నలు. వీటిలో మీకు ఎన్నింటికి సమాధానం తెలుసో చెక్ చేసుకోండి..
1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
వాల్మీకి
2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు
3. రామకథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
తమసా నది
4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి?
24,000.
5. శ్రీమద్రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
లవకుశలు
6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
సరయూ నది
7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
కోసల రాజ్యం
8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు
9. దశరుథుని భార్యల పేర్లు?
కౌసల్య, సుమిత్ర, కైకేయి
10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి
11. యజ్ఞకుండం నుంచి వచ్చిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎలా పంచాడు?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు
12. బ్రహ్మదేవుని ఆవలింత నుంచి పుట్టిన వానరుడెవరు?
జాంబవంతుడు
13. వాలి ఎవరి అంశతో జన్మించాడు?
దేవేంద్రుడు ( ఇంద్రుడు)
14. వాయుదేవుడి వలన జన్మించిన వానరుడెవరు?
హనుమంతుడు ( ఆంజనేయుడు)
15. కౌసల్య కుమారుని పేరేంటి?
శ్రీరాముడు
16. భరతుని తల్లి ?
కైకేయి
17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేంటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలు- తల్లి సుమిత్ర
18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు?
వశిష్ఠుడు
19. విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చేసరికి రాముడి వయస్సు?
12 సంవత్సరములు
20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
మారీచ, సుబాహులు
21. రాముడికి అలసట, ఆకలి లేకుండా ఉండేందుకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేంటి?
బల-అతిబల
22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
సిద్ధాశ్రమం
23. తాటకి భర్త పేరు?
సుందుడు
24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
అగస్త్యుడు
25. గంగను భూమికి తీసుకొచ్చేందుకు తపస్సు చేసిందెవరు?
భగీరథుడు
26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది?
జహ్ను మహర్షి త్రాగివేయడం వల్ల
Also Read: త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన కల విన్నాక ఏడుపు ఆపిన సీతాదేవి, ఇంతకీ ఎవరీ త్రిజట
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే