2022 ఏప్రిల్ 8 శుక్రవారం రాశిఫలాలు


మేషం 
మేష రాశి వారికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది. మిత్రులతో ఫలవంతమైన చర్చలు ఉంటాయి. విద్యార్థులకు ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. గతంలో ఉన్న కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది.  మీ బాధ్యతను నిర్వర్తించడంలో వెనుకాడరు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.


వృషభం
ప్రత్యర్థి మాటల వల్ల మీకు కోపం రావచ్చు. మీ మనస్సును నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరినీ దుర్భాషలాడవద్దు. మీరు కార్యాలయంలో అధికారులను కలుస్తారు.మీ పురోగతిలో ఆటంకాలు ఉండొచ్చు. సామాజిక స్థితి బాగానే ఉంటుంది. భగవంతుని ఆరాధించడంలో ధైర్యాన్ని పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి.
 
మిథునం
నిలిచిపోయిన పనిని పూర్తి చేయడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ప్రేమికులకు ఈరోజు సంతోషకరమైన రోజు. దంపతుల మధ్య ఏదో విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.


Also Read:  రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం Part 2


కర్కాటకం
మీ మాటతీరుని మార్చుకోండి. స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. వ్యాపారులకు సమస్యలు తొలగుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. గుర్తుతెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడొచ్చు. విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం.


సింహం
అర్ధంలేని చర్చలో సమయాన్ని వృధా చేయకండి. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం ఉంటుంది. ఈరోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. రిస్క్ తీసుకోవచ్చు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులు పెద్ద పదవిని పొందవచ్చు. 


కన్యా
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఈ రోజు, మీరు ఇంటి పనులను పూర్తి చేయడానికి పరుగులు తీస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దలతో సమయం గడపగలుగుతారు. విద్యార్థులకు శుభసమయం.  ఈరోజు బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది.


Also Read:  రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం 


తులా
మీరు ఈరోజు ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ పెద్ద సమస్య తొలగిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులు లాభపడతారు. వృత్తికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్లాన్ వేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు.


వృశ్చికం
ఈరోజు రుణాలు ఇవ్వడం మానుకోండి. మీరు ఎవరికి అప్పు ఇచ్చినా ఆ డబ్బు తిరిగిరాదు.  వేరేవారి మాటల్లో తలదూర్చకండి.  కుటుంబ విషయాల్లో మీ మొండి వైఖరిని విడిచిపెట్టండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గందరగోళానికి దూరంగా ఉండండి. ఎవరికైనా సలహాలు ఇవ్వడం మానుకోండి. ఈరోజు సాధారణంగా ఉంటుంది. 


ధనుస్సు
ఈరోజు మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మీరు గతంలో మీ పెట్టుబడి డబ్బును తిరిగి పొందకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉండదు.


Also Read: త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన కల విన్నాక ఏడుపు ఆపిన సీతాదేవి, ఇంతకీ ఎవరీ త్రిజట


మకరం
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. మీ సమస్య తీరిపోతుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. మీరు స్నేహితుడి పార్టీకి హాజరు కావచ్చు. మీ మనసులో ప్రేమను తెలియజేయండి.  ఆలోచించి మాట్లాడండి. ఉద్యోగ రీత్యా విహారయాత్రకు వెళ్లాల్సి రావచ్చు. మకర రాశి వారు ఈరోజు మంచి సమాచారాన్ని పొందుతారు.


కుంభం
గతంలో తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి వాటిని పునరావృతం చేయవద్దు. ఈరోజు మంచి రోజు అవుతుంది. దంపతుల మధ్య ఏర్పడిన అయోమయం తొలగిపోతుంది. పిల్లల విజయంతో ఉత్సాహంగా ఉంటారు. చదవడం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఖర్చు చేస్తారు. 
 
మీనం
బాధ్యతారహితమైన వైఖరి మీకు ప్రాణాంతకంగా మారొచ్చు. ఆఫీసులో సహోద్యోగి మాటలు బాధించవచ్చు. గత పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశం ఉంది. బీమా సంబంధిత పనులు పూర్తవుతాయి.  పాత మిత్రులను కలుస్తారు. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు.


Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే