Hanumakonda Road Accident: శాయంపేటలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ, ఓ ఆటో (టాటా ఏస్ వాహనం)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట శివారులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది.


పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజులాగే కూలీ పని కోసం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మొగుళ్లపల్లి మండలంలో మిరప తోటలో కాయలు ఏరడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా,  మరో 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.


పోలీసుల కథనం ప్రకారం.. 
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేటపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చీ తోటలో పనికి వెళ్లేందుకు ట్రాలీ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో, ట్రాలీలో సైడ్‌కు నిలబడిన కూలీలందరికి యమపాశంగా మారింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ కాగా, మరో 15 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న శాయంపేట ఎస్ఐ వీరభద్రరావు, పరకాల ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీలో తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు.


Also Read: Hyderabad Road Accident: రామాంతపూర్‌లో రోడ్డు ప్రమాదం - భర్త కళ్లెదుటే మహిళపై నుంచి వెళ్లిన లారీ


Also Read: weird: ప్రపంచంలో అత్యధికంగా దోపిడీకి గురవుతున్నవి ఇవే, వాటిలో మొదటి స్థానం దేనిదో తెలుసా?