దేవాలయంలో అడుగుపెట్టగానే, ఇంట్లో పూజామందిరంలోనూ  ప్రతి భక్తులు మొదట చేసేపని  గంట కొట్టడం. ఆ తర్వాతే దేవుడిని దర్శించుకుంటారు. ఇంకా హారతి ఇచ్చినప్పుడు, నైవేద్యం సమర్పించినప్పుడు గంట కొడతారు. ఆ పని చేయాలని తెలుసు కానీ ఎందుకన్నది ఎంతమందికి తెలుసు. అసలు గుడిలో గంట ఎందుకు కొడతారు ? గంట కొట్టడం వలన ప్రయోజనం ఏంటి... 


గంట ఎందుకు కొట్టాలి



  • దేవుని ముందు గంట కొట్టడం వలన ఆ శబ్ధం వినిపించగానే  ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులను, చెడు శక్తులు దూరంగా వెళ్లిపోతాయట.

  • దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం. దేవాలయంలో గంట మోగిస్తే సకల శుభాలకు సంకేతం అని కూడా అంటారు. ఆలయంలో కానీ, ఇళ్లలో కానీ గంట శబ్ధం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది

  • గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు.

  • హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడాని ఈ గంట కొడతారు. అంటే దీనికి అర్థం ఏంటంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న దేవుని మాత్రమే హారతి ఇవ్వకుండా సకలదేవుళ్లని ఆలయంలో ఆహ్వానిస్తున్నామని అర్థం.

  • కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుందంటారు. ఈ నాదం వినబడడం వలన మనిషిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని, మనసుని దేవుడిపై నిలిపేలా చేస్తుందని చెబుతారు. 


Also Read: ఆధ్యాత్మికంగా 108 కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా..
ఆలయంలో ఆరు రకాలైన గంటలు
ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి వివిధ ప్రాంతాల్లో గంటలు కనిపిస్తాయి. వీటిని ఆరు రకాల గంటలుగా చెబుతారు. 


మొదటి గంట: ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే మనకు ధ్వజస్తంభం దగ్గర కనిపిస్తుంది. దీనిని బలి అని పిలుస్తారు. పక్షులకు ఆహారాన్ని పెట్టే సమయంలో ఈ గంటను మోగిస్తారు.


రెండో గంట: రెండవ గంట ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మోగిస్తారు.


మూడో గంట: మూడవ గంటను దేవుడికి మేలుకొలుపు పాట పాడుతున్న సమయంలో మోగిస్తారు.


నాలుగో గంట: ఈ గంట ఆలయం మూసివేసే సమయంలో మోగిస్తారు.


ఐదో గంట: ఈ గంట ఆలయంలో మంటపంలో మోగించే గంట.


ఆరో గంట: ఆరవ గంటను స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు మోగిస్తారు. చాలామంది స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు  ఎదురుగా ఉన్న గంట కొడుతుంటారు.ఎలాంటి పరిస్థితుల్లో కూడా హారతి సమయంలో మంటపంలో ఉన్న గంటను మ్రోగించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.


Also Read: మీ రాశి మీ బలహీనత ఏంటో చెప్పేస్తుంది.. మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి..
Also Read: మీ పేరు 'N'తో మొదలైందా... మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం...
Also Read:   మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...