మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆయన నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క ఆయన 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇవి పూర్తి కాకుండానే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. చిరు సినిమాల లైనప్ చూసి యంగ్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు.
సినిమాలు ఒప్పుకోవడం వరకు ఓకే కానీ.. ఆయనకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శకనిర్మాతలకు పెద్ద టాస్క్ అయిపోతుంది. సీనియర్ హీరో కావడంతో కుర్ర హీరోయిన్లెవరూ మెగాస్టార్ పక్క సూట్ అవ్వరు. అందుకే కాజల్ లాంటి హీరోయిన్ ను రెండు సినిమాల్లో తీసుకున్నారు చిరు. ఇప్పడు తమన్నాతో రొమాన్స్ చేయబోతున్నారు. అలానే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో అనుష్క ఆయన సరసన నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇక వెంకీ కుడుముల సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకున్నారు. ఇదివరకు ఆమె చిరుతో కలిసి సినిమా చేయడంతో అతడి పక్కన సూట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమెకి బదులుగా మరో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు.. మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. తమిళంలో 'పేట', 'మాస్టర్' వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం ధనుష్ తో 'మారన్' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ ఒప్పుకుంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. మాళవిక వయసు తక్కువే అయినప్పటికీ.. మెగాస్టార్ సరసన బాగానే ఉంటుందని భావిస్తున్నారు. సీనియర్ హీరోలకు సెట్ అయ్యే లక్షణాలు ఆమెకి ఉన్నాయి. మరి మాళవికను ఒప్పుకుంటుందో లేదో చూడాలి!