Ghani Release dates: బాబాయ్ పవన్ రూటులో అబ్బాయ్ వరుణ్ తేజ్... 'గని'కి కూడా రెండు రిలీజ్ డేట్స్!

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమాకు రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. వారం వ్యవధిలో ఏదో ఒక విడుదల తేదీలో వస్తామని చెప్పారు. 

Continues below advertisement

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన సినిమా 'గని' (Ghani Movie). తొలుత గత ఏడాది డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 25న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పుడు ఆ తేదీకి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదలకు సిద్ధం కావడంతో 'గని' సినిమా ముందుకు వచ్చింది.

Continues below advertisement

ఫిబ్రవరి 25న లేదంటే మార్చి 4న 'గని' సినిమాను (Ghani Movie Latest Release Date) విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో ఏదో ఒక రోజున వస్తారన్నమాట. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా కోసం కూడా రెండు విడుదల తేదీలు ప్రకటించారు. అందులో ఒకటి ఫిబ్రవరి 25, మరొకటి ఏప్రిల్ 4. బాబాయ్ రూటులో అబ్బాయ్ వరుణ్ కూడా రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించాడు. అయితే... ఇక్కడ ఓ మెలిక ఉంది. 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25న వస్తే... 'గని' రాదు. ఆ తర్వాత మార్చి 4న వస్తుంది. ఒకవేళ 'భీమ్లా నాయక్' ఏప్రిల్ 1కి వెళితే... 'గని' ఫిబ్రవరి 25న వస్తుందని ఇండస్ట్రీ టాక్. 

కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ 'గని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ కథానాయిక. ప్రత్యేక గీతం 'కొడితే...'లో తమన్నా డాన్స్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ పాటను విడుదల చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటించారు. 

Continues below advertisement