ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు. 


M, T అక్షరాలతో పేరున్న వారెలా ఉంటారంటే.. 



  • M, T అక్షరాలతో పేరు మొదలయ్యే వారి ఆలోచనలు చాలా ధృడంగా ఉంటాయి.

  • ఏదైనా పని తలపెడితే ఆ పని పూర్తయ్యేవరకూ ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటారు, ఎంత దూరమైనా వెళతారు.

  • వీళ్లు రాజులా జీవించేందుకు ఇష్టపడతారు.

  • వీరు అంతర్ముఖులు..వీరి ఆలోచనలు, నిర్ణయాలు ఎవరికీ తెలియనీయరు. అంతమాత్రాన మోసం చేస్తారని కాదు వీరు అత్యంత నిజాయితీపరులు, నమ్మదగిన వారు

  • మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు

  • వీరిలో ఉండే లోపం ఏంటంటే అధిక కోపం.. కోపం కారణంగా చాలాసార్లు తమని తాము కంట్రోల్ చేసుకునే స్టేజ్ దాటిపోతారు. ఫలితంగా తప్పులు చేస్తారు, వారి కోపం వల్ల వారికే నష్టం జరుగుతుంది

  • వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఎవరైనా వీరి గౌరవాన్ని  కించపరిస్తే అస్సలు సహించలేరు. గౌరవాన్ని పోగొట్టుకునేందుకు అస్సలు తగ్గరు

  • వీరు అందరితో తొందరగా కలసిపోతారు,  ఎవ్వరైనా తొందరగా స్నేహం చేసేస్తారు

  • కెరీర్ ని గట్టిగా ప్లాన్ చేసుకుంటే ఎంత కష్టపడి అయినా తాము అనుకున్న స్థానానికి చేరుకోగలరు

  • వందల మందిలో ఉన్నా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో వీరు సక్సెస్ అవుతారు

  • ఎవ్వరికిందా ఉండి పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు...కేవలం తమ మనసుకి నచ్చినదే చేస్తారు.

  • నా జీవితం నా ఇష్టం అన్నట్టుంటారు.. తమ వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యాన్ని ఇష్టపడరు.

  • వీళ్లు చాలా క్రమశిక్షణతో ఉంటారు, ఏదైనా పనిని సమయానికి ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

  • వీరి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. అందుకే అందర్నీ తొందరగా ఆకర్షిస్తారు

  • వీరి ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలను చాలామంది ఇష్టపడతారు..

  • సమాజంలో వీరికంటూ ఓ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది... 


ఇవి కామన్ గా ఉండొచ్చని చెప్పే లక్షణాలు మాత్రమే..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి..గమనించగలరు


Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
Also Read:  ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3
Also Read:  రేవతి మినహా చివరి ఏడు నక్షత్రాల్లో జన్మిస్తే మీరు సూపర్..నక్షత్ర దోషాలు Part-4