అప్పట్లో ఆపరేషన్ల హడావుడి పెద్దగా ఉండేది కాదు....నార్మల్ డెలివరీ కావడంతో పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, పాదం ఏంటో చూసి అవసరమైన శాంతి, పూజలు , జపాలు, హోమాలు చేయించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. శుభసమయం, శాంతి లేని నక్షత్రం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు. మరి ఏ నక్షత్రం, ఏఏ పాదాల్లో పుడితే ఎలాంటి దోషమో తెలుసుకోండి...


Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. కొన్ని నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే..మరికొన్ని నక్షత్రాల్లో ఒక్కో పాదానికి ఒక్కో ఫలితం ఉంటుంది. 


21. ఉత్తరాషాడ నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మిస్తే దోషం లేదు. 


22. శ్రవణం నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మిస్తే దోషం లేదు. 


23. ధనిష్ట నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మిస్తే దోషం లేదు. 


24. శతభిషం నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మిస్తే దోషం లేదు. 


Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2


25. పూర్వాభాద్ర నక్షత్రం 1 2 3  పాదాల్లో జన్మిస్తే దోషం లేదు. . నాల్గవ పాదము సామాన్య దోషం


26. ఉత్తరాభాద్ర నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మిస్తే దోషం లేదు. 


27. రేవతి నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. 4 వ పాదంలో జన్మించిన శిశువుకి గండం. ఈ రేవతి నక్షత్రం చివరి ఘడియల్లో జన్మించిన మృత్యుంజయ జపం, రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి. 


ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3


శిశువు జన్మించిన తర్వాత పురిటి శుద్ధి అయ్యాక జన్మపత్రిక రాయించుకుని, దోషాలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి.శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి అంటారు పెద్దలు. అందుకే సాధ్యమైనంత తొందరగా శాంతి జరిపించాలంటారు. 


నోట్- దోషం ఉన్న నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే అపోహవద్దు. ఈ కథనం భయభ్రాంతులకు గురిచేయలనే ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. కేవలం కొన్ని శాంతులు, హోమాలు, జపాలు చేయడం ద్వారా చెడు ఫలితాలు పూర్తిగా తొలిగిపోతాయంటారు. అయితే ఏం చేసినా నమ్మకం ప్రధానం..అది లేనప్పుడు నక్షత్ర దోషాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 


Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి