Spirituality: హిందూ సంప్రదాయం ప్రకారం...భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలి. ముఖ్యంగా  ధాన ధర్మాలు, పూజలు,నోములు చేసేటప్పుడు భర్తకి భార్య తప్పనిసరిగా ఎడమవైపునే ఉండాలి...అప్పుడే ఫలితం దక్కుతుందని చెబుతారు.ఎందుకంటే..సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని రూపొందించేటప్పుడు తనలో కుడి భాగాన్ని పురుషుడిగా గాను, తనలోని ఎడమ భాగాన్ని స్త్రీ గా తీసుకుని...ఆడ మగను  సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహా విష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మీని ఎడమ స్థానంలో పదిలంగా భద్రపరిచాడు. ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా శరీరంలో ఏడమభాగాన్ని పార్వతికి ఇచ్చేశాడు. ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడమవైపునే ఉంటారు. అందుకే నిజజీవితంలోనూ భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపే ఉండాలని చెబుతారు


Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది


ఎడమవైపే ఎందుకంటే
సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు అర్చకులు కొన్ని సూచనలు చేస్తుంటారు. అయ్యవారి రూపాన్ని చూడాలి అంటే ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో చూడమంటారు. అదే అమ్మవారిని చూడాలంటే కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో చూడమంటారు. స్పష్టంగా అర్థం అవ్వాలంటే పార్వతీ పరమేశ్వర అర్థనారీశ్వర రూపాన్ని గుర్తుచేసుకోవాలి. శంకరుడు కుడివైపు అమ్మవారు ఎడమవైపు ఉంటారు. ఇద్దరూ కలసిన రూపాన్ని చూస్తే రెండు కళ్లుమీద మూతలు తొలగించు అని చెబుతారు. దీనివెనుకున్న పరమార్థం ఏంటంటే...


Also Read: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!



  • శరీరాన్ని నిలువుగా రెండు భాగాలు చేస్తే కుడివైపు బలంగా ఉంటుంది.. ఎడమవైపు కుడివైపు కన్నా అల్పంగా ఉంటుంది.

  • కుడివైపు ఉన్న ప్రతి భాగం ఎడమవైపు ప్రతిభాగం కన్నా ఎంతోకొంత బలంగా ఉంటుంది. కుడిచేతికున్న బలం ఎడమచేతికి ఉండదు. కుడి కన్ను ఉన్నంత తీక్షణంగా ఎడమకన్ను ఉండదు.

  • కుడి సూర్య భాగం..ఎడమ చంద్రభాగం..అంటే కుడివైపు సూర్యనాడి-ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది

  • ఆభరణాలు చేయించుకున్న వారు కూడా కుడివైపు సూర్యుడి బొమ్మను, ఎడమవైపు చంద్రుడి బొమ్మను ఆభరణంగా చేయించుకునేవారు.

  • పగటి పూట సూర్యనాడి...రాత్రి పూట చంద్రనాడి ప్రకాశవంతంగా ఉంటుంది..అందుకే పగటిపూట నిద్రించేటప్పుడు ఏడమవైపు తిరిగి..రాత్రి వేళ కుడివైపు తిరిగి నిద్రపోవాలంటారు

  • కుడి-ఏడమకు ఇంత శక్తి ఉంది కాబట్టి సూర్యనాడిగా పురుషుడిని- స్త్రీని చంద్రనాడిగా చెబుతారు

  • భార్య సంపూర్ణ క్షేమాన్ని,యోగాన్ని, ఆమె పోషణను భరించే భర్త కుడివైపు.. భర్తకు సహకరిస్తూ నీ బలం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకుంటానని భార్య ఎడమవైపు ఉంటారు.

  • అర్థనారీశ్వర రూపం వెనుకున్న అర్థంకూడా ఇదే..అయితే కుడివైపు భర్త ఎడమవైు భార్య..ఇద్దరూ ఒకేలా ఉండాలి... తల ఆలోచనకు కాలు ఆచరణకు సంకేతంలా...ఆలోచన నుంచి ఆచరణ వరకూ అన్నింటా ఇద్దరూ సమానంగా ఉండాలి..


నోట్:  కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించిన విషయాలు, పండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం