నడుముదాటి జడ అల్లుకున్న అమ్మాయిని చూసి ముచ్చటపడని మగవారుంటారా? సంచెడు డబ్బులతో కానిపని...గుప్పెడు మల్లెపూలతో అవుతుందన్న సామెత కూడా జడను చూసే పుట్టుకొచ్చిందేమో. అయినా  నేటి జనరేషన్లో అసలు జడేసుకుంటున్నారా.  జుట్టుకి క్లిప్పో, రబ్బరు బ్యాండో పెట్టి వదిలేస్తున్న వారు కొందరైతే, విరబోసుకుని తిరిగే వారు మరికొందరు. పెళ్లిళ్ల సమయంలో కూడా రెడీమేడ్ జడలొచ్చి చేరాయి. ఇంతకీ  జడ ఎందుకు వేసుకునేవారో తెలుసా...


జడని మూడు రకాలుగా వేసుకునేవారు
1.రెండు జడలు వేసుకోవడం:  రెండు జడలు వేసుకునే వారిని చిన్న పిల్ల అని ఇంకా పెళ్లికాలేదని అర్థం. ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడి విడిగా ఉందని అర్థం. 
2. ఒక జడ వేసుకోవడం: పెళ్లైన స్త్రీలు రెండు జడలు వేసుకోకుండా ఒకటే జడ వేసుకుంటారు. అంటే తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం. 
3. ముడి వేసుకోవడం: జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం. 


Also Read: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
అయితే.. ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా.. చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలు గా విడతీసి త్రివేణీసంగమం లా కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు రకరకాల అర్ధాలు చెబుతారు పెద్దలు. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం. ఇంకా, సత్వ, రజ, తమో గుణాలు ....జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్ధాలు కూడా ఉన్నాయంటారు. అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు పెళ్లైన వారా, పెళ్లికానివారా, పిల్లలు ఉన్నారా-లేరా అనే విషయం తెలిసిపోయేదట.


Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలోగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకుని, క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లారాదంటారు. అలా చేస్తే జ్యేష్టా దేవి మీ వెంటే ఉంటుందట. మరి దేవతా ప్రతిమల్లో అమ్మవారు జుట్టు విరబోసుకుని ఉంటారెందుకు అనే క్వశ్చన్ రావొచ్చు... దానికి సమాధానం ఏంటంటే..ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ,రజో,తమో గుణాలు ఆమెలో ఉండవు.  అమ్మవారు కామాన్ని హరించేది..అందుకే దేవతలకు ఈ నియమం వర్తించదు. 


Also Read: శీతాకాలం.. మంచు కురిసే సమయం.. ఈ రాశుల వారికి భలే ఇష్టమట!
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి