జులై 05 మంగళవారం కుమార షష్టి


శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మథుడు ఆటంకం కలిగించాడు. తీవ్రమైన ఆగ్రహందో మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు. అదే సమయంలో శంకరుడి నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన ఆ తేజస్సుని గంగానదిలో  రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు. కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని చెబుతారు. అందుకే ఈ రోజుని కుమారషష్టి( జులై 5 మంగళవారం)రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.


ఆరు ముఖాలతో అవతరించడం వల్ల కుమారస్వామిని షణ్ముఖుడని పిలుస్తారు. 



  1. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం

  2. పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం

  3. శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం

  4. శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం

  5. శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం

  6. లౌకిక సంపదల్ని అందించే ముఖం


కుమార షష్టికి ముందొచ్చే రోజుని స్కంద పంచమి(జులై 04 సోమవారం)గా పిలుస్తారు. అంటే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు.



  • పంచమి రోజు ఉపవాసం ఉండి, కుమారషష్టి రోజు స్వామిని పూజిస్తే మంచి గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు.

  • ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుందని భక్తుల విశ్వాసం.  

  • ఈ రెండు రోజులు సుబ్రమణ్యస్వామికి అభిషేకం చేయించినా, అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.

  • వీలైతే దగ్గర్లో ఉన్న పుట్టకు వెళ్లి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి, బియ్యంపిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే ఇంకా మంచిదని చెబుతారు పండితులు.

  • సంతానం కలగాలన్నా, సంపదలు రావాలన్నా, కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలన్నా, విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే స్కందపంచమి, షష్టి తిథుల్లో స్వామివారి ఆరాధనే చక్కని పరిష్కారం అంటారు పండితులు.


Also Read: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!


సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం (Subramanya Ashtakam)


హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥


దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥


దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥


హారాదిరత్నమణియుక్తకిరీటహార,కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాzమరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥


పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥


శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥


సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।


సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్​క్షణాదేవ నశ్యతి ॥


Also Read: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..


Also Read:  కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?